365 తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ హైదరాబాద్, జూలై 1 2020: ఆ స్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాదులోని అమీర్ పేటలో ఉన్న ఒక ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఇంటి వద్దనే క్వారన్టైన్ ఉంటూ చికిత్స తీసుకొంటున్న వారి కోసం స్పెషల్ హోమ్-క్వారన్టైన్ కేర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఆస్టర్ హోమ్-క్వారన్టైన్ కేర్ ప్యాకేజీల పేరుతో ప్రవేశ పెట్టిన ఈ పథకం ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వారి అత్యంత ప్రత్యేకమైన ఆస్టర్@హోమ్ కార్యక్రమం క్రింద చేపట్టబడింది.ఆస్టర్@హోమ్ క్రింద ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వారు నిపుణులైన సిబ్బంది తో ఇంటి వద్దనే అవసరమైన వైద్య సంబంధిత సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాదపడుతూ సుదీర్ఘ సమయం వైద్య సంబంధిత సేవలు అవసరమైన వారికి అంటే క్యాన్సర్, నరాలకు చెందిన వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు,కిడ్నీ సంబంధిత వ్యాధుల వంటి వాటితో భాదపడుతున్న వారికి ఇలాంటి సేవలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల క్రింద అవసరమైన పేషెంట్లకు నర్సింగ్, వ్యాధి నిర్థారణ సేవలు,వైద్యుల సలహా సంప్రదింపులు ఇంటి వద్దనే లేదా వీడియో లేదా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అందజేయబడతాయి.ప్రస్థుతం కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో ఎందరో కోవిడ్ పెషెంట్లు ఇంటి వద్దనే క్వారన్టైన్ చేయబడి చికిత్స తీసుకొనే పరిస్థితులలలో అలాంటి వారికి వైద్య సేవలు ఇంటి వద్దే అందించేందుకు వీలుగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు ప్రత్యేకమైన ఆస్టర్ హోమ్-క్వారన్టైన్ కేర్ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు.ఇలా నూతనంగా ప్రవేశ పెట్టిన ఆస్టర్ ప్రైమ్ హోమ్-క్వారన్టైన్ బైసిక్ కేర్ ప్యాకేజి రూ. 11,999.00 కే పొందవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా రోజుకు రెండు సార్లు నిపుణులైన నర్సింగ్ సిబ్బంది ద్వారా టెలిఫోన్ ఆధారంగా పేషెంట్ యొక్క టెంపరెచర్, బిపి వంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది. అలానే రెండు సార్లు వీడియో లేదా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో సంప్రదింపులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేకంగా టెలీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నర్సింగ్ సేవలు, పర్యవేక్షణ తో పాటూ ప్రతి రోజూ డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అంతే గాకుండా రోజుకు రెండు విడుతలలో అవసరమైన మందులను పేషెంట్ ఇంటి వద్దనే అందించడం తో పాటూ పెషెంట్ స్వయంగా తన శరీర ఉష్ణోగ్రత, బిపి వంటి వాటిని చూసుకొనేందుకు వీలు కలిపించే ప్రత్యేకమైన సెల్ఫె మానిటరింగ్ గైడ్ లైన్స్ కిట్, ప్రత్యేకమైన టాయిలెట్రీ కిట్, ఇన్సెంటివ్ స్పైరో మీటర్ వంటివి కూడా అందజేయడం జరుగుతుంది.ఇక ఇతరత్రా అనారోగ్యాల కారణంగా వైద్యుల పర్యవేక్షణ ఎక్కువగా అవసరమైన వారికి ఆస్టర్ హోమ్-క్వారన్టైన్ కేర్ ప్యాకేజీ ని రూ.12,999.00 లకు అందజేయబడుతుంది. ఇందులో రోజూ ఎక్కువ సార్లు వైద్యుల,నర్సింగ్ సిబ్బంది టెలీ ,వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పేషెంట్ తో మాట్లాడడం జరుగుతుంది. ఇక ఇంట్లోనే ఉండడం వలన మానసిక సమస్యలు తలెత్తిన పెషెంట్ల కు అవసరమైన సైకాలజిస్టు కన్సల్టేషన్ అవసరమైనపుడు వారికి ప్రత్యేకంగా రూ.13,999.00 ల ప్యాకేజీ క్రింద సేవలు అందించబడతాయి. హైదరాబాదు నగరం మధ్యలో అమీర్ పేటలో నెలకొల్పబడిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ 204 పడుకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. తెలంగాణా రాష్ట్రంలో వైద్య సేవలు అందించడంలో ఎంతో ప్రఖ్యాతి గడించిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన వైద్య సేవలను హైదరాబాదు నగరవాసులకే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోగులకు అందించడం జరుగుతోంది. 2006 లో ప్రైమ్ క్లినిక్స్ పేరుతో 10 మంది కన్సల్టెంట్స్ తో ప్రారంభించబడిన సంస్థ 2007 నాటికి 96 పడకలతో కూడిన మల్టీ స్పెషాలటీ హాస్పిటల్ గా రూపాంతరం చెందింది. పాల్గొన్నారు.