Sat. Jul 27th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 24,హైదరాబాద్: స్పోర్ట్స్‌ స్కూల్‌ బెంగళూరులోని స్పోర్ట్స్‌ స్కూల్‌ అనూప్‌ శ్రీధర్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి మెంటార్‌గా పుల్లెల గోపీచంద్‌ : విద్యార్థులను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దేందుకు… విద్య, క్రీడలను ఒకే చోటికి తెచ్చే సంప్రదాయాన్ని, వాతావరణాన్ని సృష్టించడమే ది స్పోర్ట్స్‌ స్కూల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌ 2019లో బెంగళూరులో ఇది ప్రారంభమైంది. దేశంలో యువ ప్రతిభావంతులను గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం, చదువుతో పాటు ప్రపంచస్థాయి వసతులతో చాంపియన్ల పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించడమే ది స్పోర్ట్స్‌ స్కూల్‌ లక్ష్యం. భారత్‌ను ప్రపంచ శక్తిమంతమైన క్రీడాగా మార్చేందుకు.. టెన్నిస్‌ కోసం రోహన్‌ బోపన్న, ఫుట్‌బాల్‌ కోసం బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌, క్రికెట్‌ కోసం రాబిన్‌ ఊతప్ప సలహాదారుడిగా ఉన్న క్రికెటింగ్‌ ఎక్సెలెన్స్‌ను ది సోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడంతో పాటు విద్యాబోధన కోసం జైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిగినర్స్‌, ఇంటెర్‌మీడియేట్‌, ప్రొఫెషనల్స్‌కు అనూప్‌ శ్రీధర్‌ శిక్షణ ఇస్తారు. మరికొంత మంది కోచ్‌ల భాగస్వామ్యంతో మరిన్ని క్రీడల్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాం. బ్యాడ్మింటన్‌ ప్రొగ్రాంకు పుల్లెల గోపీచంద్‌ మెంటార్‌గా ఉన్నారు. ప్రారంభం నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌ క్రీడలను, విద్యను చక్కగా సమ్మిళితం చేస్తున్నది. విద్యార్థులను అథ్లెట్లుగా తయారు చేయడంతో పాటు అన్ని అంశాల్లో చాంపియన్లుగా తీర్చిదిద్దేందుకే ప్రాధాన్యమిస్తున్నాం.

అత్యున్నత స్థాయిలో ఆడి నిరూపించుకొని కోచ్‌గా శ్రీధర్‌ అనూప్‌ అవతరించారు. పుల్లెల గోపీచంద్‌ చాంపియన్‌ ప్లేయర్‌, ప్రపంచంలో అత్యున్నత బ్యాడ్మింటన్‌ కోచ్‌. స్టూడెంట్‌-అథ్లెట్లకు ఈ ఇద్దరు దిగ్గజాలు దిశానిర్దేశం చేయడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా అని ది స్పోర్ట్స్‌ స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ చెన్‌రాజ్‌ చెప్పారు. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కు అభివృద్ధి, విస్తరణ, బలపడడం కచ్చితంగా ముఖ్యం. బ్యాడ్మింటన్‌ గురించి మాట్లాడగానే ముందుగా మెదడులో మెదిరే పేరు హైదరాబాద్‌. విస్తరణలో భాగంగా తర్వాతి దశలో హైదరాబాద్‌తో పాటు ఈశాన్య రాష్ర్టాల్లోనూ ది స్పోర్ట్స్‌ స్కూల్‌ను విస్తరించే ప్రణాళికలో ఉన్నాం అని స్పోర్ట్స్‌ స్కూల్‌ వ్యవస్థాపకులు, కల్పెన్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 2020 మేలో అద్భుతంగా డిజైన్‌ చేసిన 12ఇండోర్‌ సింథటిక్‌ కోర్టులు ప్రారంభం కానున్నాయి. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ జిమ్‌తో కూడిన బ్యాడ్మింటన్‌ హాల్‌ ఉండనుంది. రికవరీ, కౌన్సిలింగ్‌ రూమ్‌లు ఉండనున్నాయి. మెంటల్‌ కండీషనింగ్‌ కూడా బ్యాడ్మింటన్‌ ప్రోగ్రాంలో ఉంటుంది. ప్రొఫెషనల్‌ అథ్లెట్లకు కావాల్సిన కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, న్యూట్రిషియన్లతో పాటు అన్ని సదుపాయాలు ఒకే చోటు కల్పిస్తున్నాం. ది స్పోర్ట్స్‌ స్కూల్‌ పనితీరును కొంతకాలం నుంచి దగ్గరి నుంచి పరిశీలిస్తున్నా. వారి దృక్పథం నా ఆలోచనలకు దగ్గరగా ఉంది.

ప్లేయర్‌, కోచ్‌గా అనూప్‌ శ్రీధర్‌ నాకు రెండు దశాబ్దాలుగా తెలుసు. స్పోర్ట్స్‌ స్కూల్‌లో అనూప్‌తో కలిసి పని చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్యాడ్మింటన్‌లో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చడమే మా లక్ష్యం అని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చెప్పారు.