365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, 28 ఫిబ్రవరి 2020: 19 ఏళ్లు, 12 దేశాలు, 6గురు ఏజెంట్లు, 1మాస్టర్ మైండ్. హాట్‌స్టార్ స్పెషల్స్, ఫ్రైడే స్టోరీటెల్లర్స్‌తో సంయుక్తంగానిర్మించిన స్పెషల్ ఆప్స్.. 2020లోనే అతిపెద్ద స్పై యాక్షన్ థ్రిల్లర్ కాబోతుంది. 8 ఎపిసోడ్స్‌గా రాబోతున్న ఈ సిరీస్ ఇప్పుడు హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమైంది. గత 19 ఏళ్లుగా భారత్ ఎదుర్కొన్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దీన్ని రూపొందించారు. భారత పార్లమెంటుపై 2001 దాడితో
మొదలు, ఆ తర్వాత జరిగిన దాడులైన 26/11, కశ్మీర్ ఉగ్రవాద దాడులతో సహా అనేక ఇతర సంఘటనలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.అన్నింటికి మించి దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ని వెంబడించడం, అతడ్ని వెంటాడి వేటాడి చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్‌లో చేసిన సాహసాల్ని ఇందులో ప్రధానంగా హైలెట్ చేశారు. స్పెషల్ ఆప్స్‌ని నీరజ్ పాండే, దీపక్ కింగ్‌రానీ, బెనజీర్ అలీ ఫిదా రచించారు. వీరంతా భారతీయ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, శత్రువుల్ని ఎలా పసిగడుతుంది అనే విషయాల్ని కూలంకుషంగా పరిశీలించి, పరిశోధించిన తర్వాతే.. ఈ ఎపిసోడ్స్‌ని మొదలుపెట్టారు. అందుకే ఇదిఅద్భుతమైన క్వాలిటీతో, పర్‌ఫెక్ట్ ప్లాన్నింగ్‌తో, అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. ఇక లొకేషన్లు కూడా సహజంగా ఉండేందుకు భారతదేశం సహా టర్కీ, అజర్‌బైజాన్, జోర్డాన్ లాంటి దేశాల్లో చిత్రీకరించారు.

హాట్‌స్టార్ స్పెషల్ సమర్పించు స్పెషల్ ఆప్స్‌లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. ప్రధాన పాత్రలో కేకే మీనన్ నటించారు. ఆయనతో పాటు..కరణ్ టాకర్, సయామి ఖేర్, దివ్యా దత్తా, వినయ్ పాథక్, ముజమ్మిల్ ఇబ్రహీం, మెహర్ విజ్, విపుల్ గుప్తా, సజ్జాద్ డెలాఫ్రూయిత్, పర్మీ , సనా ఖాన్,శరద్ కేల్కర్, కెపి ముఖర్జీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పించు స్పెషల్ ఆప్స్.. మార్చి 17, 2020న హాట్‌స్టార్ వీఐపీలో 7 భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నీరజ్ పాండే మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ ఆప్స్ కథని నేను చాలా ఏళ్ల క్రితం ఆలోచించాను. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఇది తీయడానికి , అభివృద్ధి చేయడానికి చాలా ఓపిక , పరిశోధన అవసరం. ఇప్పుడు కథ చెప్పడానికి, అన్నింటికి మించి ఎక్కడా రాజీపడకుండా తీసే ఫార్మాట్‌లకు ప్రాముఖ్యత లభించింది. దీంతో గత రెండు దశాబ్దాల నుంచి జరిగిన అనేక వాస్తవ సంఘటనలను తెరకెక్కించే అద్భుతమైన అవకాశం, అలాంటి టీమ్ కూడా దొరికింది. ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిని సెల్యులాయిడ్‌పై చూపించబోతున్నాం అని అన్నారు ఆయన. ఈ సందర్భంగా కేకే మీనన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పించు స్పెషల్ ఆప్స్‌లో భారతీయ ఇంటెలిజెన్స్‌ను చాలా అద్భుతంగా చూపించారు. అండర్ కవర్ ఏజెంట్లే మన కాలపు నిజమైన హీరోలు. చూడ్డానికి వారంతా మనలా చాలా సాధారణంగా కన్పిస్తారు, అందరిలో కలిసిపోతారు. కానీ వాళ్లంతా నిరంతరం విధుల్లో ఉంటారు. వివిధ రకాల ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించి, సేవ చేస్తారు. అనేక ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మెండ్‌ని పట్టుకోవటానికి ప్రయత్నించే ఈ ఏజెంట్ల జీవితాల కథను స్పెషల్ ఆప్స్ మీ ముందుకు తీసుకువస్తుంది అని అన్నారు ఆయన. ఈ సందర్భంగా దివ్యా దత్తా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. భారతదేశపు అతిపెద్ద శత్రువు అయిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన మ్యాన్‌హంట్ గురించి స్పెషల్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్స్ డైనమిక్, షార్ప్‌రైటింగ్, వినూత్నమైన టేకింగ్‌తో మన స్క్రీన్‌పై ఎప్పుడూ చూడని ఎడ్జ్-ఆఫ్-సీట్ సిరీస్‌గాఉండబోతున్నాయి. అన్నింటికి మించి భారీ తారాగణం కూడా స్పెషల్ ఆప్స్‌కి స్పెషల్ అట్రాక్షన్. ప్రతీ పాత్ర సూక్ష్మంగా, క్లిష్టంగా,బాగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. నిజమైన భావోద్వేగాలను నటించే చూపించేటప్పుడు కథ సమయం, జరిగిన వాతావరణం, బ్యాక్‌గ్రౌండ్ మనల్నిమరింత కృతనిశ్చయంతో నటించేలా చేస్తుంది అని అన్నారు ఆమె.

కథ-కథనం
స్పెషల్ ఆప్స్ కథ విషయానికి వస్తే.. హిమ్మత్ సింగ్ అనే రా ఏజెంట్
జీవిత కథే ఈ సిరీస్. దేశంలో జరుగుతున్న అనేక ఉగ్రవాద దాడులకు ఒక లింక్ ఉందని.. ఇవన్నీ ఒక మాస్టర్‌మైండ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే విషయాన్ని హిమ్మత్ సింగ్ గుర్తిస్తాడు. వీటన్నింటికి కారణం ఇఖ్లాక్ అనే ఉగ్రవాది అని తెలుసుకుంటాడు. దీంతో.. తన దగ్గర ఉన్న ఏజెంట్లు అయిన ఫరూక్, రుహానీ, జుహి, బాలా అవినాష్‌ని ఒక టాస్క్‌ఫోర్స్‌గాఏర్పాటు చేస్తాడు. వీరంతా వివిధ మారువేషాల్లో ప్రపంచం మొత్తం తిరిగి మాస్టర్‌మైండ్‌ని పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు.మరి స్పెషల్ ఆప్స్ టీమ్.. మన దేశానికి అతిపెద్ద శత్రువుని పట్టుకుందా? ఇక్కడ ట్రైలర్ చూడండి.హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పించు స్పెషల్ ఆప్స్… 17 మార్చి, 2020 నుంచి ప్రారంభం.. కేవలం మీ హాట్‌స్టార్ వీఐపీలో మాత్రమే.
