Sat. Jul 27th, 2024
HCCB designs customised virtual engagement events to motivate its employees during the pandemic

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, విజయవాడ, ఆగస్టు 19,2020 ః భారతదేశంలో సుప్రసిద్ధ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్‌ కోకా–కోలా బేవరేజస్‌ (హెచ్‌సీసీబీ) పలు వర్ట్యువల్‌ ఎంప్లాయీ ఎంగేజమెంట్‌ కార్యక్రమాలను పరిచయం చేసింది. ప్రస్తుత మహమ్మారి వేళ తమ ఉద్యోగులకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా సుదీర్ఘకాలం కోసం వారిని సిద్ధం చేసేందుకు దీనిని లక్ష్యంగా చేసుకున్నారు. అధికశాతం మంది ఉద్యోగులు విభిన్న భౌగోళిక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న కారణంగా, హెచ్‌సీసీబీ ప్రత్యేకంగా కస్టమైజ్డ్‌ ఆన్‌లైన్‌ కార్యక్రమాలను ఉద్యోగులను ఎంగేజ్‌ చేయడానికి రూపొందించింది. ప్రస్తుత మమహ్మారి సమయంలో భౌతికంగా దగ్గర ఉంటూ పనిచేసే అవకాశాలను తోసిపుచ్చిన వేళ  నూతన పనిమార్గాలను అవలంభించిన,అనుసరించిన హెచ్‌సీసీబీ ఉద్యోగులకు ఈ వర్ట్యువల్‌ ఎంపాలయీ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి.ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు, ఫ్యాక్టరీలు, డిపోలలోని అసోసియేట్లు, క్షేత్ర రంగంలోని సేల్స్‌ సిబ్బంది కోసం రూపకల్పన చేసిన ఈ వర్ట్యువల్‌ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలను వారంలోని విభిన్న రోజుల కోసం విస్తరించారు. ఉదాహరణకు ‘ద లెర్నింగ్‌ హవర్‌’. దీనిలో డిజిటల్‌ కార్యకలాపాలతో వెబినార్లు ఉంటాయి. వీటిని బృందాలు లేదా జంటలుగా నిర్వహించడం ద్వారా ఉద్యోగులకు నూతన అంతర్దృష్టులు, జ్ఞానాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం, శుక్రవారం జరుగుతుంది. అలాగే ‘వెల్‌నెస్‌ హవర్‌’. దీనిలో నిష్ణాతులు,ఉద్యోగుల మానసిక శారీరక సంక్షేమం  పై దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక సదస్సులు చేస్తారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం జరుగుతుంది. ‘ద టాక్‌ షోస్‌’ అనేది అనధికార సదస్సు. దీనిని ఆఫీసు పనిగంటలు ముగిసిన తరువాత నిర్వహిస్తారు. దీనిలో ఉద్యోగులు వర్ట్యువల్‌గా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని సాయంత్రపు డ్రింక్స్‌తో సహా అందిస్తారు. ఈ సమయంలో తమకు అభిరుచి కలిగిన పలు అంశాలపై మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని వారం విడిచి వారం శుక్రవారం రోజున ఆఫీసు పనిగంటలు ముగిసిన తరువాత సాయంత్రపు వేళలో నిర్వహిస్తారు. వీటితో పాటుగా కంపెనీకి చెందిన ‘హ్యాపీనెస్‌ టీమ్‌’, వర్ట్యువల్‌ టాలెంట్‌ షోస్‌ను ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తుంది.

HCCB designs customised virtual engagement events to motivate its employees during the pandemic
HCCB designs customised virtual engagement events to motivate its employees during the pandemic

అదనంగా, హెచ్‌సీసీబీ పలు వర్ట్యువల్‌ ట్రైనింగ్‌ సదస్సులను తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తుంది. ఈ సదస్సులను తమ ఉద్యోగులు పలు రంగాలలో తమ నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది తమ ఉద్యోగులు అనుసంధానితం కావడంతో పాటుగా అభ్యసిస్తూ, వృద్ధి చెందేందుకు వేదికగా సైతం పనిచేస్తుంది. మొత్తంమ్మీద 25వేల గంటల ఈ తరహా శిక్షణను క్రమం తప్పని వెబినార్ల ద్వారా అందించారు. దీనితో పాటుగా కంపెనీ,డిజిటల్‌ శిక్షణాకార్యక్రమాలైనటువంటి ప్రతిష్టాత్మక హార్వార్డ్‌ మేనేజ్‌ మెంటార్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ కూడా భాగంగా ఉంది. ప్రపంయంలో అత్యుత్తమ ఆన్‌లైన్‌ అభ్యాస పోర్టల్స్‌లో ఒకటిగా ఇది గుర్తింపు పొందినది. వీటితో పాటుగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఆన్‌లైన్‌ కోర్సు లింకెడిన్‌ లెర్నింగ్‌ సైతం అందించడం ద్వారా తాము కోరుకున్న కెరీర్,అందుకు అవసరమైన నైపుణ్యాల నడుమ ఖాళీని పూరిస్తున్నారు.విభిన్నమైన ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం వెనుక కారణాలను గురించి శ్రీ ఇంద్రజీత్‌ సేన్‌గుప్తా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్శెస్‌ ఆఫీసర్‌, హెచ్‌సీసీబీ మాట్లాడుతూ ‘‘ఉద్యోగుల శారీరక, మానసిక, భావోద్వేగ సంక్షేమం పట్ల మేము ఆందోళనగా ఉన్నాము. మారుతున్న పని వాతావరణాన్ని వేగంగా, ఎలాంటి భయం, ఆందోళన లేకుండా స్వీకరించడంతో పాటుగా దానికనుగుణంగా తమను తాము మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాము.మా ఉద్యోగుల పలు ఆసక్తులను పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశాము. సంభావ్య బర్న్‌ఔట్స్‌ నివారించడానికి అవసరమైన విరామాలను సైతంఇది అందిస్తుంది. ఓ నియమంగా,  ఈ కార్యక్రమాలన్నీ కూడా ఐశ్చికం మరియు స్వచ్ఛందంగా ఉండేలా రూపకల్పన చేశాం. అందువల్ల మా ఉద్యోగులకు అవసరమైన వశ్యతను అందిస్తుంది’’ అని అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్‌ 21,2020వ తేదీన హెచ్‌సీసీబీ ఓ మ్యూజిక్‌ ప్లేలిస్ట్‌ను విడుదల చేసింది.  తద్వారా తమ అసోసియేట్లు ఇంటి వద్దనే ఉండటంతో పాటుగా తమ కుటుంబ సభ్యులతో  కలిసి యోగాను ప్రాక్టీస్‌ చేయవచ్చు.ఈ  ప్లే లిస్ట్‌ను హెచ్‌సీసీబీ కోసం డాక్టర్‌ ఇళయరాజా స్వరపరిచిన సంగీత నేపథ్యం ఆధారంగా రూపొందించారు.

తమ ఉద్యోగుల కుటుంబ సభ్యులను గుర్తించేందుకు సైతం హెచ్‌సీసీబీ ఓ కార్యక్రమం పరిచయం చేసింది. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అధిక సమయం పనిచేసేందుకు తోడ్పాటునందిస్తున్న అసలైన మద్దతు వ్యవస్ధ వారు. ఉదాహరణకు, ఈ కంపెనీ ఓ ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌ ఇంకింగ్‌ విత్‌ టింకిల్‌ను నిర్వహించింది.దీనిలో ఉద్యోగుల చిన్నారులు గ్రూప్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌తో పాటుగా చిన్నారుల కోసం భారతీయ పక్ష పత్రిక టింకెల్‌ యొక్క ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ తో సమావేశం నిర్వహించింది. దీనిలో  చిన్నారులు మరింతగా అభ్యసించి, నేర్చుకునే అవకాశం కలిగింది.ఈ కంపెనీ, సాంకేతిక విలీనాలపై ఆధారపడి, నూతన చాట్‌బాట్‌ను పరిచయం చేసింది. దీనిద్వారా తమ ఉద్యోగులతో వాస్తవ సమయంలో ఈ మహమ్మారి సమయంలో సంభాషించే అవకాశం కలుగుతుంది. కంపెనీ    ఇంట్రానెట్‌పై ఓ ప్రత్యేక విభాగాన్ని సైతం సృష్టించారు. తద్వారా తమ ఉద్యోగులకు అన్ని కోవిడ్‌-19 సంబంధిత సందేహాలను పరిష్కరించే అవకాశం కలుగుతుంది