365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 19,2020 హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద, వినియోగించిన ద్విచక్రవాహన వినియోగదారుల బ్రాండ్, క్రెడ్ ఆర్ ఇప్పుడు ద్విచక్రవాహన బైబ్యాక్ ప్రోగ్రామ్ – క్రెడ్ఆర్ బైబ్యాక్ ప్లస్‌ను హైదరాబాద్‌లోని తమ షోరూమ్‌ల వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ ద్విచక్రవాహన బైబ్యాక్ ప్రోగ్రామ్‌లో భాగంగా వినియోగదారులు ఖచ్చితమైన బైబ్యాక్ విలువను తమ ద్విచక్రవాహనాలకు కొనుగోలు సమయంలో పొందుతారు. ఈ విలువను నిర్థేశించిన 12 నెలల లోపుగా క్రెడ్ఆర్‌కు తాము కొనుగోలు చేసిన ద్విచక్రవాహనాన్ని తిరిగి విక్రయించిన ఎడల పొందగలరు.
సంజీవ్ రెడ్డి నగర్, నారాయణ గూడా, హఫీజ్‌పేట వంటి సుప్రసిద్ధ ప్రాంతాలలో ఉన్నటువంటి తమ షోరూమ్‌ల వద్ద అసాధారణ డిమాండ్‌ను క్రెడ్ఆర్ అందుకుంటుంది. మరీ ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ (ఐటీ, బ్యాంకులు, బీపీఓలు), యుక్త వయసు అమ్మాయిలు, మధ్య తరహా ఆదాయ వర్గాల నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది. లాక్‌డౌన్ ముగిసిన తరువాత తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజా రవాణా వినియోగించుకోవడానికి బదులుగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను తీసుకోవడానికి ప్రజలు ప్రాధాన్యతనిస్తారని క్రెడ్ ఆర్ భావిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా మాత్రమే గాక, ప్రపంచ శ్రేణి మౌలిక వసతుల పరంగా కూడా హైదరాబాద్ ఖ్యాతిగడించింది. ఇక్కడి వినియోగదారులు టెక్నాలజీ ప్రియులు , ఎల్లప్పుడూ సృజనాత్మక ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. ప్రజా రవాణా వినియోగం పట్ల అమలవుతున్న నిబంధనల కారణంగా ద్విచక్రవాహనాన్ని వ్యక్తిగత రవాణా మార్గంగా మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా , ఖర్చులేకుండా వినియోగించుకుంటున్నారు.
క్రెడ్ ఆర్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్,శశిధర్ నందిగం, మాట్లాడుతూ “మా వినియోగదారులకు నగదుకు తగ్గ విలువనందించే ఉత్పత్తులను అందించాలనేది మా లక్ష్యం, ఇది ఇప్పటి వరకూ మేము ఆవిష్కరించిన అన్ని ఉత్పత్తులలోనూ ఉత్ప్రేరకంగా నిలిచింది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితి కారణంగా మా ఉత్పత్తులకు అసాధారణ డిమాండ్ లభించింది. ఇది మా వినియోగదారులకు మరింత విలువనందించేలా ఉత్పత్తులను అందించడానికి స్ఫూర్తినందించింది. మా వ్యాపార జ్ఞానం, ధరల క్రమసూత్ర పట్టికలు కారణంగా మా ధరల అంచనాలు అత్యంత ఖచ్చితత్త్వంతో ఉంటున్నాయి. ప్రామాణిక ధరలనే నేపధ్యమే లేని మార్కెట్‌లో ఆ తరహా ప్రామాణిక ధరలు అందిస్తున్న మొట్టమొదటి కంపెనీగా నిలిచాం” అని అన్నారు. “షేర్డ్ మొబిలిటీ మరియు ప్రజా రవాణా నుంచి వ్యక్తిగతంగా సొంతం చేసుకున్న రవాణాను వినియోగించుకోవడం ఇక ఎంతమాత్రమూ విలాసం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా అది అవసరంగా మారుతుంది. ప్రస్తుత వినియోగదారులు పూర్తి ఆప్రమప్తంగా ఉండటంతో పాటుగా విలువ ఆధారితంగా ఉంటున్నారు. అదే సమయంలో తమ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకుంటూనే నాణ్యమైన, వ్యక్తిగతంగా సొంతమైన రవాణా మార్గాలను వినియోగించుకోవాలనుకుంటున్నారు. క్రెడ్ఆర్ యొక్క బైబ్యాక్ కార్యక్రమం అతి సరళమైన , ప్రైవేట్‌గా సొంతమైన రవాణా ఉత్పత్తిగా మార్కెట్‌లో నిలువనుంది” అని అన్నారు.
అదనంగా, కొనుగోలుదారులు క్రెడ్ఆర్ ప్రామాణిక/ప్రాచుర్యం పొందిన సేవలైనటువంటి ఉచిత ఆరు నెలల వారెంటీ, పేపర్ బదిలీ సహాయం ,ఏడు రోజుల ఎలాంటి ప్రశ్నలూ అడుగని భద్రతా పాలసీ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఇటీవలనే ఆవిష్కరించిన బైక్‌ల కాంటాక్ట్‌లెస్ డోర్‌స్టెప్ డెలివరీ విజయం అందించిన ఉత్సాహంతో ఈ నూతన కార్యక్రమం బై బ్యాక్ ప్లస్ సైతం వినియోగదారుల నుంచి చక్కటి స్పందన అందుకుంటుందని నమ్ముతుంది.