Mon. Oct 7th, 2024

11 కిమీల పొడవు కలిగిన ఈ కారిడార్­లో 9 స్టేషన్లు ఉన్నాయి. ఇది జంటనగరాలైన హైదరాబాద్ , సికింద్రాబాద్­లను అనుసంధానిస్తుంది

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి16, హైదరాబాద్ :థాలేస్ సిగ్నలింగ్, పర్యవేక్షణ , కమ్యూనికేషన్ వ్యవస్థలతో సశక్తమైన ఈ కారిడార్ జూబిలీ బస్ స్టేషన్ నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు విస్తరించి ఉన్నది. రోడ్డు మార్గంలో రోజూ ప్రయాణీకులకు 45 నిముషాల పట్టే ప్రయాణసమయాన్ని ఈ మార్గం దాదాపు 16 నిముషాలకు తగ్గిస్తుంది.

L&T మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL), దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కారిడార్-2ను ప్రారంభించటంతో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తామన్న తమ వాగ్దానాన్ని పునరుద్ఘాటించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావ్ ప్రారంభించబడిన ఈ 11 కిమీల మార్గంలో హైదరాబాద్ మెట్రోకు థాలేస్, అధునాతన సిగ్నలింగ్ , ట్రైన్ కంట్రోల్ సాంకేతిక పరిజ్ఞానం , పర్యవేక్షణ &కమ్యూనికేషన్ సిస్టమ్­లను అందించింది.

ఈ కారిడార్ జంటనగరాలైన హైదరాబాద్ , సికింద్రాబాద్­ల మధ్య ఒక ముఖ్యమైన లింక్. ఈ కారిడార్, ప్రస్తుతం పని చేస్తున్న మెట్రోకారిడార్-1, మెట్రోకారిడార్-3లను కలిపే ముఖ్యమైన కారిడార్ కాగలదు. అంతే కాక ఈ కారిడార్ రెండు అంతర్-రాష్ట్ర బస్ స్టేషన్­లైన జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) , మహాత్మా గాంధి బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) ల మధ్య కూడా ప్రయాణీకులకు చక్కని అనుసంధానతను కల్పించగలగటం ద్వారా ముఖ్యమైన జంక్షన్ కాగలదు.

మొత్తం 9 స్టేషన్లను కవర్ చేస్తున్న ఈ అనుసంధానాత్మక కారిడార్, రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే 45 నిముషాలు పట్టే దూరాన్ని కేవలం 16 నిముషాల్లో దాటగలిగేందుకు, తద్వారా వారు తమ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించుకునేందుకు సహకరిస్తుంది.

డిసెంబర్ 2012లో, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ ,ఉపసంస్థ అయిన L&T మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్,హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భారతదేశంలో మొట్టమొదటిసారి కమ్యూనికేషన్ ఆధారిత రైలు కంట్రోల్ (సిబిటిసి) , సమగ్ర కమ్యూనికేషన్లు, సూపర్విజన్ వ్యవస్థలు కలిగిన సిగ్నలింగ్ వ్యవస్థను కల్పించటం కోసం భారతదేశంలో థాలేస్ను నియమించింది. సిబిటిసి సిగ్నలింగ్­కు అదనంగా థాలేస్, తన సమగ్ర కమ్యూనికేషన్, సూపర్విజన్ ప్యాకేజ్­*ను కూడా అందించింది.

గతంలో నెలకొల్పిన, కారిడార్-1 (13 కిమీల మియాపూర్-అమీర్­పేట్) , కారిడార్-3 (17 కిమీల అమీర్­పేట్-నాగోల్)లతో కూడిన ప్రాథమిక స్థాయిలలో కూడా థాలేస్ వారు అధునాతన సిగ్నలింగ్, కమ్యూనికేషన్ల ఆధారిత ట్రెయిన్ కంట్రోల్ (సిబిటిసి), ,ఇంటెగ్రేటెడ్ కమ్యూనికేషన్స్ అండ్ సూపర్విజన్ సిస్టమ్స్ ను నెలకొల్పారు.

“మెట్రో రైలు రంగంలో ప్రపంచంలో అతి పెద్ద పిపిపి అయిన హైదరాబాద్ మెట్రో రైలు, భారతదేశంలో ఒక గొప్ప ప్రాజెక్ట్. ఈ మెట్రో రైలులో సగటున రోజుకు 400,000 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తూంటారు. నగర-పర్యావరణాత్మక , సుస్థిరమైన రవాణా ఆర్కిటెక్చర్ దిశలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఒక మైలురాయి. ఈ ప్రాజెక్టులో అధునాతనమైన సాంకేతికపరిజ్ఞానాలు ఉన్నాయి. థాలేస్ మాకు విశ్వసనీయమైన సాంకేతికపరిజ్ఞాన భాగస్వామి కావటం, హైదరాబాద్ మెట్రోను సురక్షితమైన మరింత విశ్వసనీయమైనదిగా తయారు చేయటంలో మాకు సహకరిస్తుండటం, మాకు ఆనందాన్ని కలిగిస్తోంది,” అని కెవిబి రెడ్డి, ఎండి&సిఇఒ, L&TMRHL చెప్పారు.

“హైదరాబాద్­లో ఒక బిజీ మెట్రో లైన్­ను అనుసంధానించటం ద్వారా ఈ కొత్త కారిడార్ – II లో సిగ్నలింగ్ రియు కమ్యూనికేషన్ వ్యవస్థలను కల్పించటం ద్వారా థాలేస్ మరోసారి, నగరంలో పట్టణ రైలు రవాణా వ్యవస్థను సురక్షితంగానూ స్మార్టుగానూ తయారు చేయగల తన సామర్ధ్యాన్ని ప్రదర్శించింది.థాలేస్ పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్, లక్షలాదిమంది ప్రయాణీకుల ప్రయాణానుభవాన్ని మరింతగా మెరుగుపరచటమే కాక, ఉద్యోగావకాశాలను గణనీయంగా పెంపొందించగలగటం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. సంవత్సరాలుగా L&TMRHL, హైదరాబాద్ మెట్రో కోసం మేము అందిస్తున్న మా సాంకేతికపరిజ్ఞానం , వినూత్న పరిష్కారాల పట్ల విశ్వాసాన్ని చూపటం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ అనుబంధం మాకు గర్వకారణం. దేశాభివృద్ధి కోసం మా విజయవంతమైన ప్రాజెక్టుల పై మరింత నిర్మాణానికి మేము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము,” అని ఇమ్మానుయేల్ దె రాక్­ఫెయుల్, వైస్ ప్రెసిడెంట్ ,కంట్రీ డైరెక్టర్, థాలేస్ ఇన్ ఇండియా.

థాలేస్ కమ్యూనికేషన్ , పర్యవేక్షణ ప్యాకేజ్­లో డాటా ట్రాన్స్­మిషన్, ప్రయాణీకుల ప్రకటనలు, ప్రయాణీకుల సమాచార ప్రదర్శన, దోష/లోప నివేదిక సౌకర్యాలు, ఆఫీస్ ఆటోమేషన్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సిసిటివి, యాక్సెస్ కంట్రోల్ , ఇన్­ట్రూజన్ డిటెక్షన్ (చొరబాటును వెతికిపట్టుకొనుట), మాస్టర్ క్లాక్, టెలీఫోనీ, వాయిస్ రికార్డింగ్ ,రేడియో టెట్రా వ్యవస్థలు ఉన్నాయి.

error: Content is protected !!