365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 12, హైదరాబాద్:
అరవింద్ కేజ్రీవాల్ ….. కాంట్రాక్టర్ల కు పని కల్పించే నాయకుడు కాదు…. సామాన్యుల సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగే నాయకుడు. అందుకే ఆయనకు ఓటర్లు మళ్ళీ పట్టం కట్టారు. ఆయన 2012, నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను స్థాపించారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. అప్పుడు హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది రోజులకే ఇరు పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో 2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. 2015 ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో గెలిచి.. సరిగ్గా ఏడాది లోనే అధికారంలోకి వచ్చింది. 2015, ఫిబ్రవరి 14న రామ్‌లీలా మైదానం వేదికగా సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.