365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 30 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కాపులను యాచించే స్థితిలోనే ఉంచేశారని, వారు శాసించే స్థితికి రావాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జరిగిన కాపు సంక్షేమ సేన సమావేశంలో పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై పలువురు కాపుసంఘాల నాయకులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు.ఆంధ్రప్రదేశ్‌లో కాపులను యాచించే స్థితిలోనే ఉంచేశారని, వారు శాసించే స్థితికి రావాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జరిగిన కాపు సంక్షేమ సేన సమావేశంలో పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై పలువురు కాపుసంఘాల నాయకులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. వారితో కాపు కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యు ఎస్ రిజర్వేషన్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కాపుల గురించి మాట్లాడితే కొందరు తనను కులానికి కట్టేస్తారని, కానీ, తాను ఏ కులం గురించైనా సరే ఇలాగే మాట్లాడతానని చెప్పారు. ‘ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. కాపులను మొదటి నుంచి కొందరు విభజించి పాలించారు. శాసించే కాపులను అణచివేశారు. దేహి అనుకునే పరిస్థితికి తెచ్చారు. రాజ్యాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వారిని యాచించే స్థితిలో పెట్టేశారు. యాచించే పరిస్థితి మారాలి. శాసించే స్థితికి రావాలి.’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

కాపులు శాసించే స్థితికి రావాలి : పవన్ కళ్యాణ్
తుని విధ్వంసం ఘటనకు సంబంధించి….
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ సేన కొన్ని అంశాలను పవన్ కళ్యాన్ దృష్టికి తీసుకొచ్చింది. ఆయా అంశాలను జనసేనాని ప్రస్తావించారు. ‘జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన కాపు మహిళా నేస్తం పథకం 40 లక్షల మంది మహిళలకు దక్కాల్సింది. కానీ, అది 2.5 లక్షల మందికి మాత్రమే అందింది. అలాగే, తుని విధ్వంసం ఘటనకు సంబంధించిన కేసులను ఎత్తివేశారు. కానీ, తునిలో కాపు సభకు మద్దతుగా ఇతర జిల్లాల్లో జరిగిన ఘటనలపై పెట్టిన కేసులను మాత్రం ఎత్తివేయలేదు. వాటిని ఎత్తేయాలి. ఇక విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ రూ.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించేశారు. ఇంకా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి.’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. హరిరామజోగయ్య ఇచ్చిన రిపోర్టులోని అంశాలను కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

కాపులను బీసీల్లో కలపడం మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీలను బలహీనం చేయడం కాదు. దాన్ని జనసేన నమ్ముతుంది. వారికి రావాల్సిన హక్కులను తిరిగి తెస్తుంది. కాపులు యాచించే స్థితి కాదు. శాసించే స్థితికి రావాలి.’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కాపులు రాత్రికి రాత్రి మార్పును కోరుకోకుండా స్థిరంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళితే రాజకీయంగా ముందడుగు వేయవచ్చన్నారు. ఆ తర్వాత కాపుల బాటలోనే యాదవులు, గౌడ, ఇతర సామాజిక వర్గాల వారు కూడా ముందుకు వెళ్తారన్నారు. రాష్ట్రంలో 27 శాతం మంది ఉన్న కాపులను ఓట్ బ్యాంక్‌గానే చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓటుబ్యాంకుగా మారినంత కాలం యాచించే స్థాయిలోనే ఉంటారన్నారు. జగన్ కానీ, చంద్రబాబు కానీ కాపు నేతల వద్దకే రావాలని అలా శాసించే స్థితికి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.