Sun. Dec 22nd, 2024
Kaveri Seeds wins “Masters of Risk in Agriculture” award at the India Risk Management Awards

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 22, 2021:హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ సీడ్‌ కంపెనీ కావేరీసీడ్స్‌కు 7వ సీఎన్‌బీసీ –టీవీ 18 ఇండియా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డ్స్‌ 2020–21 వద్ద మాస్టర్స్‌ ఆఫ్‌ రిస్క్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అవార్డును మిడ్‌ –క్యాప్‌ విభాగంలో అందించారు.ఈ అవార్డు గెలుచుకోవడంపై కావేరీ సీడ్స్‌ వ్యవస్థాపకులు జీవీ భాస్కర్‌ రావు మాట్లాడుతూ ‘‘నేడు, కావేరీ సీడ్స్‌ విజయవంతంగా ప్రతిష్టాత్మక సీడ్‌ కంపెనీ గా నిలిచింది. ఈ అవార్డును అందుకోవడం మరోమారు నాకు గర్వకారణంగా ఉంది. ఈ విజయాన్ని మా వినియోగదారులు,  ఉద్యోగులు, రైతులకు ఆపాదిస్తున్నాము. వారే మా అసలైన వృద్ధికి భాగస్వాములు. ప్రాధాన్యతా భాగస్వామిగా, మేము ఎల్లప్పుడూ చిన్న, సన్నకారు రైతుల జీవితాలను సమృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని అన్నారు.

Kaveri Seeds wins “Masters of Risk in Agriculture” award at the India Risk Management Awards
Kaveri Seeds wins “Masters of Risk in Agriculture” award at the India Risk Management Awards

రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకోవడంతో పాటుగా దానిని అనుసరించడానికి అశేషంగా కృషి చేసిన సంస్ధలను గుర్తించేందుకు సీఎన్‌బీసీ–టీవీ18 ఐఆర్‌ఎంఏ అవార్డులు అందజేస్తున్నారు. అసాధారణ పనితీరు కోసం నిష్ణాతులతో కూడిన స్వతంత్య్ర ప్యానెల్‌ న్యాయనిర్ణేతలు ఈ అవార్డుల విజేతలను ఎంపిక చేస్తారు.  వ్యక్తులు, సంస్థలకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అవగాహన, అభ్యాసాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తాయి.

error: Content is protected !!