365తెలుగు,డా కామ్ ఆన్ లైన్ హైదరాబాద్, ఆగస్టు 30, 2020: కొవిడ్-19కు ఇంతవరకు యాంటీవైరల్ మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్ సాయంతో చికిత్సలే చూశాం. కానీ, దక్షిణ భారతదేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న మెడికవర్ ఆసుపత్రిలోని వైద్య నిపుణులు తొలిసారిగా 17 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడేందుకు శస్త్రచికిత్స చేశారు. కరోనా కారణంగా అతడి ఎడమ ఊపిరితిత్తుల చుట్టూ ఏర్పడిన చీమును తొలగించారు.తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్ అనే యువకుడికి తీవ్రంగా ఛాతీనొప్పి వస్తోందని ఈనెల మొదటివారంలో మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడికి అప్పటికే రెండు వారాల నుంచి ఈ సమస్య ఉండగా, స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. సమస్య మరింత తీవ్రం కావడంతో మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే అతడికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.రోగికి ఉన్న సమస్య, అందుకు అందించిన చికిత్సలపై మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఎవరికైనా కరోనా వైరస్ సోకినప్పుడు ముందుగా అతడి/ఆమె శ్వాసవ్యవస్థ దెబ్బతింటుంది. ఈ కేసులో కొవిడ్ పాజిటివ్ అయిన యువకుడికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మరింత సమస్య ఎదురైంది. ఎడమ ఊపిరితిత్తుల చుట్టూ చీము చేరడంతో అతడికి ఊపిరి అందకపోవడం, ఛాతీలో నొప్పి లాంటివి వచ్చాయి. ఫలితంగా తప్పనిసరిగా మేము డీకార్టికేషన్ చేయాల్సి వచ్చింది” అని వివరించారు.
డీకార్టికేషన్ చేసిన తర్వాత కొవిడ్-19 తగ్గించడానికి యాంటీవైరల్ మందులు, చీము మళ్లీ చేరకుండా ఉండేందుకు యాంటీ బ్యాక్టీరియల్ మందులు ఉపయోగించాం. తర్వాత రోగి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఊపిరితిత్తులు సాధారణ స్థితికి రాగానే రోగిని డిశ్ఛార్జి చేశాం, ఇప్పుడు అతడు తన రోజువారీ పనులు సాధారణంగానే చేసుకుంటున్నాడు. బ్యాక్టీరియా తరహా గురించి తెలుసుకోడానికి చీముకు కల్చర్ పరీక్ష చేయించగా, అది సాధారణ స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా అని తేలింది” అని డాక్టర్ ప్రమోద్ తెలిపారు.అత్యంత సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి, వాటికి సరైన సమయంలో సరైన చికిత్స అందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం మెడికవర్ ఆసుపత్రులలో ఉన్నాయి. 2,500కు పైగా పడకలు, ఇప్పటివరకు 20 లక్షల మంది రోగులకు చికిత్స చేసిన అనుభవంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ మెడికవర్ ఆసుపత్రి అత్యంత పటిష్ఠమైనదిగా పేరొందింది .