365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,భారత్,జనవరి 28,2021:కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో భారత్ లో కోలుకున్నవారి శాతం దాదాపు 97% కు చేరుకుంది. భారత్ లో నమోదైన కోలుకున్న శాతం అతికొద్ది ప్రపంచదేశాల్లో మాత్రమే నమోదైంది .ఇప్పటివరకు మొత్తం 1,03,73,606 మంది కొవిడ్ బాధితులు కోలుకోగా, గత 24 గంటల్లోనే 14,301 మంది కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య ఇంకా తగ్గి ప్రస్తుతం1,73,740 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.62% మాత్రమే.
జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ధోరణికి అద్దం పడుతూ 31 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 5,000 కంటే తక్కువమంది కోవిడ్ తో బాధపడుతూ చికిత్సపొందుతున్నారు.
చికిత్సపొందుతూ ఉన్నవారిలో 78% మంది కేవలం 5 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఆ రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్.
2021 జనవరి 28వ తేదీ ఉదయం 7.30 వరకు 23,55,979 మంది దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకాలు వేయించుకున్నా రు.గడిచిన 24 గంటలలో మొత్తం 6,102 శిబిరాలలో 3,26,499 మంది టీకాలు అందుకున్నారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 42,674 శిబిరాలు నిర్వహించారు.
సంఖ్య | రాష్టం/కేంద్రపాలితప్రాంతం | టీకా లబ్ధిదారులు |
1 | అండమాన్, నికోబార్ దీవులు | 2,385 |
2 | ఆంధ్ర ప్రదేశ్ | 1,63,727 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 7,307 |
4 | అస్సాం | 19,945 |
5 | బీహార్ | 89,074 |
6 | చండీగఢ్ | 2,355 |
7 | చత్తీస్ గఢ్ | 51,647 |
8 | దాద్రా, నాగర్ హవేలి | 345 |
9 | డామన్, దయ్యూ | 320 |
10 | ఢిల్లీ | 39,764 |
11 | గోవా | 2,311 |
12 | గుజరాత్ | 94,524 |
13 | హర్యానా | 1,09,782 |
14 | హిమాచల్ ప్రదేశ్ | 14,054 |
15 | జమ్మూ కశ్మీర్ | 16,331 |
16 | జార్ఖండ్ | 24,020 |
17 | కర్నాటక | 2,67,811 |
18 | కేరళ | 82,970 |
19 | లద్దాఖ్ | 818 |
20 | లక్షదీవులు | 746 |
21 | మధ్యప్రదేశ్ | 1,31,679 |
22 | మహారాష్ట | 1,79,509 |
23 | మణిపూర్ | 2,855 |
24 | మేఘాలయ | 3,249 |
25 | మిజోరం | 6,142 |
26 | నాగాలాండ్ | 3,973 |
27 | ఒడిశా | 1,78,227 |
28 | పుదుచ్చేరి | 1,813 |
29 | పంజాబ్ | 44,708 |
30 | రాజస్థాన్ | 2,37,137 |
31 | సిక్కిం | 1,320 |
32 | తమిళనాడు | 82,039 |
33 | తెలంగాణ | 1,30,425 |
34 | త్రిపుర | 19,698 |
35 | ఉత్తరప్రదేశ్ | 1,23,761 |
36 | ఉత్తరాఖండ్ | 14,690 |
37 | పశ్చిమ బెంగాల్ | 1,58,193 |
38 | ఇతరములు | 46,325 |
మొత్తం | 23,55,979 |
కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 77.84% మంది 7 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 5,006 మంది కోలుకోగా, మహారాష్టలో 2,556 మంది, కర్నాటకలో 944 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో 11,666 మందికి కొత్తగా కోవిడ్ నిర్థారణ అయింది. వారిలో 81.96% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు.కొత్త కేసులలో కేరళ 5,659 మందితో మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్రలో 2,171 కేసులు, తమిళనాడులో 512 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
గడిచిన 24 గంటలలో 123 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో 75.61% మంది ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. మహారాష్ట్రలో అత్యధికంగా 32 మంది చనిపోగా,కేరళలో 20, పంజాబ్లో
10 మరణాలు నమోదయ్యాయి.