365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, నవంబర్ 22,2020: సుప్రసిద్ధ సృజనాత్మక ఆరోగ్య సాంకేతిక స్టార్టప్ క్లెన్స్టా, ఇప్పుడు ఐఐటీ ఢిల్లీతో భాగస్వామ్యం చేసుకుని క్లెన్స్టా–కోవిడ్ 19 ప్రొటెక్షన్‌ను ఆవిష్కరించింది. వైరస్‌లనుంచి పూర్తి భద్రతను ఇది అందించడంతో పాటుగా ప్రభావవంతంగా 24 గంటల పాటు పనిచేస్తుంది. ఈ ఉత్పత్తిని వినియోగించడం అతి సులభం. రోజులో మూడుసార్లు దీనిని రాసుకోవడం ద్వారా నూరుశాతం వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షణ అందిస్తుంది. 100 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉన్నటువంటి బాటిల్ ధర 298 రూపాయలు. నోవెల్ కోవిడ్ వైరస్ తో మీరు చేస్తున్నపోరాటానికి ఇది అత్యుత్యమ పరిష్కారంగా ఇది నిలుస్తుంది.
![క్లెన్ స్టా 24/7 కోవిడ్-19 ప్రొటెక్షన్ లోషన్‌ను ఆవిష్కరించిన క్లెన్స్టా](http://365telugu.com/wp-content/uploads/2020/11/clensta.gif)
ఈ కోవిడ్–19 భద్రతా లోషన్‌ను ప్రోలాంగ్డ్ యాంటీవైరల్ టెక్నాలజీ (దీనినే పీఏపీ సాంకేతికత అనికూడా అంటారు)ఆధారంగా రూపొందించారు. ఇది కోవిడ్–19, ఫ్లూ వైరస్, ఎంఆర్ఎస్ఏ మరియు కాండిడా అల్బికాన్స్ సహా వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణను 24 గంటల పాటు అందిస్తుంది. మానవ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మొట్టమొదటి, పేటెంటెడ్ పీఏపీ సాంకేతికతతో నానో బయోటెక్నాలజీ సూత్రీకరణతో ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దారు. ఈ ఉత్పత్తి యొక్క యాంటీవైరల్ ,యాంటీ మైక్రోబియాల్ సామర్థ్యంను ఎన్ఏబీఎల్ అక్రిడియేటెడ్ లేబరేటరీలో పరీక్షించడంతో పాటుగా ఐఐటీ ఢిల్లీ ఇన్క్యుబేషన్ కేంద్రంలో కూడా పరీక్షించారు. విభిన్న సమయాలలో చేసిన ఈ పరీక్షలలో 99.5% ప్రభావాన్ని ఇది చూపింది.
ఈ సందర్భంగా డాక్టర్ పునీత్ గుప్తా, సీఈవో అండ్ ఫౌండర్–క్లెన్స్టా ఇంటర్నేషనల్ మాట్లాడుతూ ‘‘ఆత్మనిర్భర్ సాధించేందుకు ఇది సమయమని నేను నిర్ణయించుకోవడంతో పాటుగా కోవిడ్–19తో పోరాడటానికి వీలైనంతగా అత్యుత్తమ మార్గంతో వచ్చాము. పూర్తి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి ఇది. క్లెన్స్టా కోవిడ్–19 లోషన్ కోవిడ్–19 నుంచి మీకు అత్యుత్తమ భద్రతా కవచంగా నిలుస్తుంది. ఈ ఉత్పత్తిని సాంకేతికతంగా మూడు అత్యాధునిక చురుకైన పదార్థాలతో సూత్రీకరించారు. ఇవి నానోపార్టికల్స్ ట్రిప్లెట్ కాంప్లెక్స్ (ఏజీఎన్పీఎస్), బయోసర్ఫ్క్టెంట్, యాసిడ్. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ (ఆర్ఓఎస్)ను నియంత్రిత స్ధాయిలో 24 గంటల పాటు ట్రిప్లెట్ కాంప్లెక్స్ అందించడంతో పాటుగా యాంటీవైరల్ లేదా యాంటీ మైక్రోబియాల్ మైక్రో ఎన్విరాన్మెంట్ను చర్మపు ఉపరితలంపై అందిస్తుంది. ఇది 99.5% సుదీర్ఘమైన రక్షణను కోవిడ్–19 వైరస్ నుంచి మరియు ఇతరసూక్ష్మక్రిముల నుంచి అందిస్తుంది. ఈ ఉత్పత్తి పదార్థాలు సీడీసీ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఉండటంతో పాటుగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన్‌స్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతులను సైతం సుదీర్ఘకాలపు వినియోగం కోసం పొందాయి.
![క్లెన్ స్టా 24/7 కోవిడ్-19 ప్రొటెక్షన్ లోషన్‌ను ఆవిష్కరించిన క్లెన్స్టా](http://365telugu.com/wp-content/uploads/2020/11/clensta.gif)
దీని మైక్రోబియాల్ సామర్థ్యం కేవలం కోవిడ్–19 వైరస్‌కు మాత్రమే పరిమితం కాబడి ఉండలేదు, ఇది సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (ఎస్ఎస్ఐ) తో పోరాడటంతో పాటుగా చంపడానికి కష్టమైన రెసిస్టెన్స్ బ్యాక్టీరియా (ఎంఆర్ఏస్ఏ) నుంచి సైతం రక్షణ అందిస్తుంది. దగ్గరలోని కిరాణా స్టోర్లు , అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ–కామర్స్ వేదికలపై కూడా లభ్యమవుతుంది.