365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 5,2025 : ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక రాజమండ్రిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, అండ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “చిరంజీవి గారే మాకు మెయిన్ పిల్లర్. రామ్ చరణ్ ప్రపంచస్థాయి నటుడిగా ఎదగడం గర్వకారణం. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలి” అని పేర్కొన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారే నిజమైన గేమ్ ఛేంజర్” అని అన్నారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, “తెలుగు లో ఒక స్ట్రైట్ సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశపడ్డా. ఇప్పుడు ఆ కోరిక గేమ్ ఛేంజర్‌తో నెరవేరింది” అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ఈ చిత్రం మాస్, క్లాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.