365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్7,2020:ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ను ‘జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం’ (ఎన్ సిఎస్ఎఎమ్) గా జరుపుకొంటున్నారు. జాతీయ సైబర్ భద్రత సచివాలయం (ఎన్ఎస్ సిఎస్) సిఫారసు చేసిన ప్రకారం, సైబర్ జగత్తులో ఎదురయ్యే ముప్పుల పట్ల ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేటు రంగాన్ని కూడా అప్రమత్తం చేయడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దీనిని దృష్టిలో పెట్టుకొని వేరు వేరు పద్ధతులలో విశిష్టమైన ప్రజా జాగృతి కార్యకలాపాలను ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (ఎమ్ఇఐటివై) కి చెందిన సమాచార భద్రత సంబంధిత విద్య, అవగాహన (ఐఎస్ఇఎ) కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఐసి, సి-డిఎసి, సిఇఆర్ టి- ఐఎన్ లు వాటి వంతు గా తోడ్పాటును అందించనున్నాయి.ఈ నెలను ఐఎస్ఇఎ ‘భద్రత చైతన్య మాసం’ గా పాటిస్తోంది. మన దేశ పౌరులను డిజిటల్ యుగ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం, సైబర్ జగతి పట్ల బోధ అందించడం ద్వారా వారిని వారు కాపాడుకోగలిగే నెటిజన్లుగా వారిని ప్రోత్సహించడం కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నారు. వివిధ సైబర్ త్రెట్స్ బారి నుంచి వారిని వారు విజయవంతంగా కాపాడుకొనేందుకు అవసరమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని వారికి అందించేందుకు దేశం నలుమూలలా ప్రజలు ఈ కార్యక్రమాలలో పాలుపంచుకోవలసింది అంటూ వారిని ఆహ్వానించడం జరుగుతోంది.
‘జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం’ (ఎన్సిఎస్ఎఎమ్) ను జరిపే క్రమంలో ఈ క్రింద తెలిపిన చైతన్య కార్యకలాపాలను ఐఎస్ఇఎ నిర్వహిస్తోంది.. :
· టిప్స్: అత్యుత్తమ భద్రత చర్యలపై ఒక విశిష్టమైన సైబర్ భద్రత ఆలోచనను ప్రతి రోజు ఒకటి వంతున అందజేయడం.
· రోజువారీ వీడియో: సైబర్ భద్రత కు సంబంధించిన ఒక అంశాన్ని ప్రజలకు వివరించడం కోసం రూపొందించిన వీడియోల ను రోజుకు ఒకటి చొప్పున విడుదల చేయడం.
· సాధారణ వీడియో: వినియోగదారులు సురక్షితంగా ఉండటంలో వారికి సాయపడేలా సైబర్ భద్రత చర్యలను వివరిస్తూ సాగే ఓ సాధారణ వీడియో ను విడుదల చేయడం.
· కాన్ సెప్ట్ స్: బహుళ ప్రచారంలో ఉన్న సైబర్ భద్రత కాన్ సెప్ట్ లను గురించి వివరించడం.
· సర్వే/క్విజ్: ఒక వ్యక్తి సైబర్ భద్రత అంశంలో ఎంత వరకు ‘సైబర్ ఫిట్ నెస్ క్వోషంట్’ ను కలిగి ఉన్నదీ తెలుసుకోవడం కోసం ఒక క్విజ్ ను నిర్వహించడం; దీనిలో పాల్గొనే వారందరికీ ఇ-సర్టిఫికెట్స్ ను ఇవ్వడం.
· క్రాస్ వర్డ్: ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ భద్రత సమాచారంపై రూపొందించిన గళ్ళ నుడికట్టు ను పరిష్కరించడం ద్వారా సైబర్ భద్రత సవాళ్ళు, సైబర్ భద్రత సంబంధిత బెదరింపుల పట్ల ఒక వ్యక్తి ఎంత అవగాహనను కలిగివున్నారనేది పరీక్షించడం జరుగుతుంది. దీనిలో విజేతలుగా నిలచే వారు సర్టిఫికెట్లు గెల్చుకోవచ్చు.
· సమాచార పత్రం: దీనిలో భాగంగా సైబర్ భద్రతకు సంబంధించిన ఒక అంశం పై పూర్తి సమాచారాన్ని ఒక్కచోటులోనే (న్యూజ్ లెటర్ రూపంలో) అందించడం జరుగుతుంది.
· టూల్: సైబర్ భద్రత కు సంబంధించిన ఉపయోగకర టూల్స్ గురించి వివరించడం.
· మాల్ వేర్ అలర్టులు: వివిధ రకాలైన మాల్ వేర్ దాడుల విషయం లో అప్రమత్తం గా ఉండండంటూ అలర్ట్ స్ సందేశాన్ని పంపించడం.
· కిడ్: సైబర్ భద్రత అంశాలను బోధిస్తూ ఒక కార్టూన్ కథ ను ప్రత్యేకంగా బాలల కు అందించడం.
· చిన్న పుస్తకం: మన రోజువారీ సైబర్ జీవనంలో మనకు మేలు చేసేటటువంటి చిన్న చిన్న పుస్తకాలను తీసుకురావడం.
· నకిలీ వార్తలు: సామాజిక మాధ్యమ వేదికలలో ఎన్నెన్ని నకిలీ సందేశాలు పోగు పడుతున్నదీ ఎలా గుర్తించవచ్చో వివరించే ఒక అలర్ట్ మెసేజ్ లేదా ఒక పోస్టర్ ను గురించి ఈ ఫేక్ న్యూజ్ లో చెబుతారు.
· వర్క్ షాపులు
చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా ద్వారా అవగాహన:
సాధారణ ప్రజల చెంతకు ప్రభావవంతమైన విధంగా చేరుకోవడానికి ఐఎస్ఇఎ సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకోవడం జరుగుతోంది. దీనికి తోడు, పైన ప్రస్తావించిన కార్యకలాపాలన్నిటినీ సోషల్ మీడియా లో వెల్లడించి, అన్ని మంత్రిత్వ శాఖలు, సామాజిక మాధ్యమ నిర్వహణదారు సంస్థలు (సోషల్ మీడియా హ్యాండిల్స్), రాష్ట్రాల ఐటి కార్యదర్శి హ్యాండిల్స్, రాష్ట్రాల పోలీస్ విభాగం హ్యాండిల్స్, విద్యా మండలులు, సమాజంలో ప్రముఖ వ్యక్తులు, న్యూస్ చానళ్ళు/ మీడియా చానళ్ళను జత (ట్యాగ్) చేస్తూ ఆయా అంశాలను మరింత మంది దృష్టికి తీసుకువెళ్ళవల సిందిగా కోరడం జరుగుతుంది. వీలైనంత ఎక్కువ మంది ఈ అంశాలను గురించి తెలుసుకొనేటట్లు చేసి, ఈ అంశాలకు బహుళ ప్రజాదరణ లభించేటట్లు చూడటం దీనిలోని ముఖ్యోద్దేశ్యం.పైన చెప్పిన కార్యకలాపాలన్నిటినీ ఉదయం పూట 8.00 గంటలు మొదలుకొని రాత్రి పూట 8.00 గంటల వరకు, గంటకు ఒకసారి చొప్పున, అన్ని సామాజిక మాధ్యమ వేదికల లో నమోదు చేయడం జరుగుతోంది.
ఈ కింద ఇచ్చిన లింకులను అనుసరించగలరు:
ఫేస్ బుక్ : https://www.facebook.com/infosecawarenesss/
ట్విటర్: https://twitter.com/InfoSecAwa
యూట్యూబ్: https://www.youtube.com/c/InformationSecurityAwareness
ఇన్ స్టాగ్రామ్: https://www.instagram.com/infosec_awareness/
టెలిగ్రామ్: https://t.me/ISEAAwareness
వెబ్ సైట్ ద్వారా జాగృతి:
మొత్తం సమాచారాన్ని సామాన్య ప్రజలకు అందుబాటు లోకి తీసుకు పోవడానికిగాను ఎన్ సిఎస్ఎఎమ్-2020 పేరిట www.infosecawareness.in వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.
వర్క్ షాప్ లు/వెబినార్ ల ద్వారా జాగృతి:
ప్రభుత్వ యూజర్లు, సాధారణ యూజర్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. ఈ వర్గాల కోసం దేశవ్యాప్తంగా పోటీలను నిర్వహించాలని ఐఎస్ఇఎ తలపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగాల విభాగాలు, రాష్ట్రాల పోలీసు, విద్య, ఐటి విభాగాల సహాయాన్ని తీసుకోవడం జరుగుతుంది.
భాగస్వామి సంస్థలు:
ఎన్ సిఎస్ఎఎమ్- 2020 ని అత్యుత్తమ పద్ధతి లో ప్రజాబాహుళ్యం లోకి తీసుకుపోవడానికిగాను భారతీయ స్టేట్ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి నవరత్న కంపెనీలు, ఇతర భాగస్వామి సంస్థలతో ఐఎస్ఇఎ చేతులు కలిపింది. ఈ సంస్థలు వాటి వినియోగదారులలో సైబర్ జగత్తుకు సంబంధించిన స్పృహను విస్తరింప చేసేందుకు తోడ్పడుతున్నాయి.
ఈవెంట్ లలో పాల్గొనడానికి, మరింత ఎక్కువ సమాచారాన్ని పొందడానికి ఈ కింద ఇచ్చిన వాటిని సందర్శించగలరు:
వెబ్ సైట్ : www.infosecawareness.in
ఫేస్ బుక్ : https://www.facebook.com/infosecawarenesss/
ట్విటర్: https://twitter.com/InfoSecAwa
యూట్యూబ్: https://www.youtube.com/c/InformationSecurityAwareness
ఇన్ స్టాగ్రామ్: https://www.instagram.com/infosec_awareness/
టెలిగ్రామ్ : https://t.me/ISEAAwareness