T-SAT network channels on Airtel DTHT-SAT network channels on Airtel DTH

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 15 2020:టి- సాట్ నెట్వర్క్ ఛానళ్లు తమ ప్రసారాల్లో మరో ముంద డుగు వేసాయి.కమ్యూనికేషన్ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఏయిర్ టెల్ డీటీహచ్ లో టి-సాట్ విద్య ,నిపుణ ఛానళ్లు ప్రసారం కానున్నాయి. ఛానల్ నెంబర్లు 948, 949లలో ప్రసారాలకు అనుమతిస్తూ టి-సాట్, నెట్వర్క్,తో ఏయిర్ టెల్ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది.టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు శాటీ లైట్, సోషల్ మీడియా వేదిక ద్వార డిజిటల్ ప్రసారాలు అందిస్తూ యూట్యూబ్ లో నాలుగు లక్షల సబ్ స్ర్కైబ్స్ కలిగి ఉంది. కోవిడ్ మహామ్మారి దృష్ట్యా ఏయిర్ టెల్ నెట్వర్క్ సంస్థ తెలంగాణ విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందించేందుకు టి-సాట్ ఛానళ్లు విద్య, నిపుణ ప్రసారం చేసేందుకు అంగీకారం తెలిపింది. దేశంలోని మొబైల్ రంగంలో మూడవ స్థానంలో ఉన్న ఏయిర్ టెల్ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా డీటీహెచ్ ద్వార 10 లక్షలు, ఎక్స్ట్రీమ్ ద్వార 1.5 కోట్ల  సబ్ స్ర్రైబ్స్ కలిగి ఉండటమే కాకుండా 18 దేశాల్లో విస్తరించి ఉంది. వైర్ లెస్, మొబైల్,ఫిక్స్డ్ లైన్, హై స్పీడ్, డీటీహెచ్ ద్వార సేవలందిస్తూ దేశ వ్యాపితంగా మార్చి-2020 వరకు 423 మిలియన్ కష్టమర్లను కలిగి ఉంది. ఫలితంగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు దేశ వ్యాపితంగా విస్త్రతమవనున్నాయి.

T-SAT network channels on Airtel DTH
T-SAT network channels on Airtel DTH

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ఒప్పందం వలన  నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఆగస్టు 15వ తేదీన 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టి-సాట్,ఏయిర్ టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఏయిర్ టెల్ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో హర్శం వ్యక్తం చేశారు. తొలిసారిగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు భారతీ ఏయిర్ టెల్ లో ప్రసారం చేస్తున్నందుకు సీఈవో శైలేష్ రెడ్డి కృతజ్ఞలు చెప్పారు. ఏయిర్టెల్ డీటీహెచ్ తో పాటు ఏయిర్ టెల్ ఎక్స్ట్రీంయాప్ లోనూ విద్యార్థులు టి-సాట్, ప్రసారాలు చూడవచ్చని తెలిపారు.భారతీ ఎయిర్‌ టెల్,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సిఇఒ అవనీత్ పూరి మాట్లాడుతూ “విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యకుప్రాప్యత,అవకాశం కల్పించడానికి,డిజిటల్ అభ్యాసకులుగా మారడానికి టి-సాట్‌ తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో విద్యార్థులను తమ ఉపాధ్యాయు లుపాఠశాల,ఒకరికొకరు అనుసంధానించడానికి అన్ని రకాల టెలికాం మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా డిజిటల్ విభజనను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఎయిర్టెల్ అభినందించింది. ”