Mon. Dec 23rd, 2024
Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM's insurance scheme

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి, 19,2021:భార‌త ప్ర‌భుత్వానికి చెందిన వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ రిమోట్‌లీ పైలెటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్ట‌మ్ (ఆర్‌పిఎసెస్‌ను ) ను ఉప‌యోగించేందుకు కేంద్ర పౌర‌విమానయాన మంత్రిత్వ‌శాఖ (ఎం.ఒ.సిఎ), డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ష‌ర‌తుల‌తో కూడిన మిన‌హాయింపును ఇచ్చింది. దేశంలోని వంద జిల్లాల‌లో ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ భీమా యోజ‌న కింద‌ గ్రామ పంచాయ‌తీ స్థాయిలో దిగుబ‌డుల అంచ‌నా వేసేందుకు వ్య‌వ‌సాయం రైతు సంక్షేమ శాఖ  రిమోట్ సెన్సింగ్ స‌మాచారం సేక‌ర‌ణ సేక‌రించ‌డం కోసం డ్రోన్ల‌ను వినియోగించుకునేందుకు ఈ అనుమ‌తి వీలు క‌ల్పిస్తుంది. ఈ మిన‌హాయింపు అనుమ‌తి ప‌త్రం జారీ చేసిన‌ప్ప‌టి నుంచి ఏడాది పాటు వ‌ర్తిస్తుంది. తిరిగి డిజిట‌ల్ స్కై ప్లాట్‌ఫారంఅమ‌లు లోకి వ‌చ్చే వ‌ర‌కు ఏది ముందు అయితే అంత వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంది. అయితే  అన్ని ప‌రిమితులు, ష‌ర‌తులు ఖ‌చ్చితంగా అమ‌లు చేసిన‌ప్పుడే ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుందని పేర్కొంది. నిర్దేశిత ష‌ర‌తుల‌లో దేనినైనా ఉల్లంఘించిన‌ట్ట‌యితే  ఈ మిన‌హాయింపు చెల్లుబాటు కానిది అవుతుంది. ఇందుకు సంబంధించి పైన పేర్కొన్న సిఎఆర్ లోని పేరా 18 కింద చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

రిమోట్ ద్వారా నియంత్రించే ఎయిర్ క్రాఫ్ట్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ప‌రిమితులు , ష‌ర‌తులు:

Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM's insurance scheme
Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM’s insurance scheme

 1. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు సిఎఆర్ సెక్ష‌న్ 3, సిరీస్ 10, పార్ట్ -1 కింద పేర‌గ్రాఫ్ 5.3,6,7,8.3,9,11.1(సి,డి), 11.2(ఎ,డి), 12.4, 12.5, 12.18 , 12.19 , 15.3 ల‌కు మిన‌హాయింపు ఇవ్వ‌డం జ‌రిగింది. పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ నిబంధ‌న‌లలోని రూల్ 15 ఎ కు లోబ‌డి మినహాయింపు వ‌ర్తిస్తుంది.

2. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ (ఎ) స్థానిక పాల‌నాయంత్రాంగం (బి) ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌, (సి) హోం మంత్రిత్వ‌శాఖ (డి) వైమానిక ద‌ళం నుంచి ఎయిర్ డిఫెన్స్ క్లియ‌రెన్స్ (ఇ) ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నుంచి ( వ‌ర్తించే సంద‌ర్భంలో) రిమోట్ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ వ్య‌వ‌స్థ (ఆర్‌పిఎస్‌)ను ఉప‌యోగించ‌డానికి ముందే అనుమ‌తులు తీసుకోవ‌ల‌సి ఉంటుంది.

3. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ఆమోదిత స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్స్ (ఎస్ ఒపి) రెఫ‌రెన్స్ నెంబర్ 9119 (పిఎంఎఫ్‌బివై) ఐఎస్ఒపి 01  డ‌బ్ల్యుఆర్ ఎం ఎస్ కు చెందిన రివిజ‌న్  నెంబ‌ర్ ఒ , ఎస్ ఒ పి రెఫ‌రెన్సు నెం 91119 (పిఎంఎఫ్‌బివై) ఐఎస్ఒపి 01 ఆగ్రొటెక్‌ రివిజ‌న్ నెంబ‌ర్ ఒ,  ఎ.ఎం.ఎన్‌.ఇ.ఎక్స్ కు చెందిన ఎస్ఒపి రెఫ‌రెన్స్ నెంబ‌ర్ 9119 (పిఎంఎఫ్‌బివై) ఎస్‌.ఒ.పి01 రివిజ‌న్ నెంబ‌ర్ ఒ  నిర్దేశించిన ఆర్‌.పి.ఎ.ఎస్ న‌మూనాల‌లో మాత్ర‌మే ఆప‌రేట్ చేస్తాయి. 

 ఈ కార్య‌క‌లాపాలు పైన పేర్కొన్న ఎస్‌.ఒ.పిల ప్ర‌కారం ఉంటాయి. ఆర్‌పిఎఎస్ లు తమంత‌తాముగా ప్ర‌భుత్వానికి ఈ విష‌యాలు తెలియ‌జేయాలి. అలాగే త‌గిన ఆమోదం క‌లిగిన డ్రోన్ అక్నాల‌డ్జ్‌మెంట్ నెంబ‌ర్ (డిఎఎన్‌), ఫ్లీట్ వివ‌రాలను వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హించ‌వ‌ల‌సి ఉంటుంది. ఎస్‌.ఒ.పిలో ఏదైనా మార్పు, స‌వ‌ర‌ణ‌, రివిజ‌న్ ఉన్న‌ట్ట‌యితే లేదా న‌మూనా లేదా వినియోగంలో మార్పు ఉన్న‌ట్ట‌యితే దానిని ఎస్‌.ఒ.పిలో చేర్చి త‌గిన అనుమ‌తి కోసం డిజిసిఎకు స‌మ‌ర్పించాలి.

Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM's insurance scheme
Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM’s insurance scheme

4. వ్య‌వ‌సాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ‌శాఖ కేవ‌లం శిక్ష‌ణ‌పొందిన , స‌రైన వ్య‌క్తులు ఆర్‌పిఎఎస్‌ను నిర్వ‌హించేలా చూడాలి. దీనికి తోడు   ఆమోదం పొందినఎఫ్‌టిఒ లు, ఆర్‌.పి.టి.ఒల ద్వారా రిమోట్‌ఫ్లైట్‌సిబ్బందికి  వ్య‌వ‌సాయం , ఆరొగ్య మంత్రిత్వ‌శాఖ శిక్ష‌ణ ఇప్పించేలా చూడాలి.
5 ఎస్‌.ఒ.పిలోపేర్కొన్న‌ట్టుగా ఆర్‌పిఎలు మంచిగా ప‌నిచేసే స్థితిలో ఉండేలా వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ చూడాల్సి ఉంది.ప‌రిక‌రం స‌రిగాప‌నిచేయ‌క పోయినా, ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే అందుకు అది బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

6.ఆర్‌.పి.ఎ ఫ్లైట్‌కు సంబంధించిన రికార్డుల‌ను వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌నిర్వ‌హించాలి. ప్ర‌తి ఆర్‌పిఎ ఫ్లైట్‌కుసంబంధించి రికార్డులు ఉంచాలి.వీటిని డిజిసిఎ కోరితే స‌మ‌ర్పించేట్టు ఉండాలి.
7. గ గ‌న‌త‌లం నుంచి ఫోటోలు తీయ‌డానికి  డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెగ్యులేష‌న్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్‌, ఒజిసిఎ లేదా వ‌ర్తించే సంద‌ర్భంలో ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ నుంచి అనుమ‌తి తీసుకోవాలి. ఆర్‌.పి.ఎ.ఎస్ ద్వారా తీసిని ఫోటోలు ,వీడియోలను వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ వినియోగించుకోవ‌చ్చు.ఆర్‌పిఎస్ భ‌ద్ర‌త‌, దానిద్వారా సేక‌రించిన స‌మాచార భ‌ద్ర‌త‌కు వ్య‌వ‌సాయం రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM's insurance scheme
Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM’s insurance scheme

8.  డిజిట‌ల్ స్కై ప్లాట్‌పారం అందుబాటులోకి వ‌చ్చిన వెంట‌నే, ఆర్‌పిఎఎస్‌ల‌ను ఎన్‌పిఎన్‌టి ( క్యుసిఐ స‌ర్టిఫై చేసిన‌)ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉండేట్టు వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ చూడాలి.
9. ప్ర‌తి ఆర్‌పిఎఎస్ మంట‌ల నుంచి త‌ట్టుకునే విధంగా గుర్తింపు ప్లేటును క‌లిగి ఉండి, దానిపై ఒఎ ఎన్‌, డిఎ ఎన్‌, ఆర్‌పిఎల మోడ‌ల్ నెంబ‌ర్ ఉండేట్టు వ్య‌వ‌సాయం , రైతు సంక్షేమం మంత్రిత్వ‌శాఖ‌చూడాలి.
10. ఆర్‌పిఎఎస్ కార్య‌క‌లాపాలు ప‌గ‌టిపూట కు మాత్ర‌మే ప‌రిమితం చేయాలి. ( సూర్యోద‌యం నుంచి సూర్యాస్త‌మ‌యం వ‌ర‌కు) అది కూడా నియంత్ర‌ణ లేని ఎయిర్ స్పేస్‌లో  క‌నుచూపుమేర వ‌ర‌కు అంటే గ‌రిష్ఠంగా 200 అడుగుల వ‌ర‌కు మాత్ర‌మే (ఎజిఎల్‌) ఉండాలి.
11.సిఎఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆర్‌పిఎఎస్‌ను విమానాశ్ర‌య ప‌రిస‌రాల‌లో వాడ‌కూడ‌దు. విమానాశ్ర‌యం స‌మీపంలో వాడ‌డం అవ‌స‌ర‌మైతే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) అనుమ‌తి తీసుకోవాలి.ఆర్‌పిఎఎస్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే స‌మ‌యం,ప్రాంతం గురించి తెలిపి అనుమ‌తి పొందాలి.

12. ఆర్‌.పి.ఎ.ఎస్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు దాని నుంచి ఎలాంటి వ‌స్తువుల‌ను కిందికిజార‌విడ‌వ కుండా వ్య‌వ‌సాయ‌,రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ చ‌ర్య‌లు తీసుకోవాలి. ఆర్‌.పి.ఎ ని వాడేట‌పుడు అందులో ప్ర‌మాద‌క‌ర ఇంధ‌నాన్ని వాడ‌డం కానీ, అది తీసుకెల్ల‌డం కానీ చేయ‌కూడ‌దు.అలాగే అనుమ‌తించిన పురుగుమందులు త‌ప్ప మ‌రి వేటినీతీసుకువెళ్ల‌రాదు.
13. అనుమ‌తించిన పురుగుమందుల పిచికారి స‌మ‌యంలో , ఇందులో పాల్గొనే వారుమిన‌హా ఇత‌రుల ప్ర‌మేయం లేకుండా వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ చూడాలి .అలాగే భ‌ద్ర‌తా చ‌ర్య‌లు (ప్ర‌త్యేకించి గాలి ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని , ఎస్ఒపి లో పేర్కొన్న విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే ఈ లేఖ‌లో పేర్కొన్న నిబంధ‌న‌లుపాటించాలి.

14.  ప్ర‌జ‌లు,ఆస్తులు, ఆప‌రేట‌ర్ గోప్య‌త‌, భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌ల‌కు వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ పూచీప‌డాలి. ఏదైనా జ‌రిగితే, అందుకు డిజిసిఎని బాధ్యులుగా చేయ‌రాదు.

15. ఏ వ్య‌క్తికి లేదా ఆస్తికి న‌ష్టం క‌లిగే విధంగా ఆర్‌పిఎఎస్ ని న‌డ‌ప‌కుండా చూడాల్సిన బాధ్య‌త వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ పై ఉంది. ఒక వేళ ఎవ‌రికైనా ప‌రిక‌రం త‌గిలి గాయం జ‌రిగితే, దానికి సంబంధించి మెడికో లీగ‌ల్ కేసుల‌కు వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త వ‌హించాల్సిఉంటుంది. ఆర్‌పిఎఎస్ వాడే స‌మ‌యంలో ఏదైనా ప్ర‌మాదం జ రిగి థ‌ర్డ్‌పార్టీకి న‌ష్టం జ‌రిగితే  అందుకు అవ‌స‌ర‌మైన ఇన్సూరెన్సు ఏర్పాటును వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ చూడాల్సి ఉంటుంది.

Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM's insurance scheme
Permission for the agricultural sector to use drones Permission for remote sensing in support of PM’s insurance scheme

16. సిఎఆర్ సెక్ష‌న్ 3,  సిరిస్ 10, పార్ట్ 1లో  పేర్కొన్న‌విధంగా ఆర్‌పిఎఎస్‌ను నోప్లై జోన్‌లో  సంబంధిత అధికారుల నుంచి త‌గిన అనుమ‌తి లేకుండా ఉప‌యోగించ‌కుండా ఉండేలా  చూడాల్సిన బాధ్య‌త వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ‌పై ఉంది.
17.ఆర్‌పిసిఎ కార్య‌క‌లాపాల వ‌ల్ల త‌లెత్తే ఏదైనా న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌నుంచి డిజిసిఎను ఆరోగ్య‌,రైతు సంక్ష‌మ మంత్రిత్వశాఖ చేయాలి.

18. ఈ లేఖ రిమోట్ తో న‌డిపై  ఎయిర్ క్రాఫ్ట్‌వ్య‌వ‌స్థ‌కు సంబంధించి ఇత‌ర ప్ర‌భుత్వ ఏజెన్సీలు రూపొందించిన నిబంధ‌న‌ల‌కు ఈ లేఖ విరుద్దంగా  ఉండ‌రాదు.
19. ఆర్‌పిసిఎ కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌లో ఏ ద‌శ‌లో అయినా  ఏదైనా ఘ‌ట‌న‌,ప్ర‌మాదం జ‌రిగితే అందుకు సంబంధించి డిజిసిఎ ఎయిర్ సేఫ్టీ డైర‌క్ట‌రేట్‌కు అందుకు సంబంధించిన నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాలి.

error: Content is protected !!