365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,జూలై 31,2022: తిరుమలలో ఛత్రపతి శివాజీ విగ్రహం వివాదం ముగిసింది. ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందిస్తూ.. తిరుమలలో ఛత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించడం లేదనేది తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతల, హిందూయేతర సంస్థల విగ్రహాలను మాత్రమే తిరుమలలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
అయితే ఇటీవల మహారాష్ట్ర భక్తులకు చెందిన వాహనం నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించడంపై కాస్త వివాదం నెలకొంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇదంతా జరిగిందని అధికారులు తెలిపారు. ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద విగ్రహాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. పాలకమండలి సభ్యుడు మిలింద్ నర్వేకర్ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు.