A policy process is needed to preserve the future health profile of the countryA policy process is needed to preserve the future health profile of the country

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ ,నవంబర్,26 2020: డిమాండ్‌,సరఫరా పరంగా దేశపు పారిశ్రామిక,ఆర్థిక శక్తి గణనీయంగా వృద్ధి చెందడమనేది, అద్భుతమైన ఫలితాల ఆధారిత,సమర్థవంతమైన రూపకల్పన, సామాజిక రంగ విధానాల అమలు,వ్యూహరచనపై రాజకీయ వ్యవస్ధలు దృష్టిపెడితేనే  సాధ్యమవుతుంది.  ఈ దిశగా, పౌష్టికాహారం మొదలైన సామాజిక రంగాల కోసం కేటాయింపులను 2018–19 సంవత్సరం లో 2500 కోట్ల రూపాయల నుంచి 2019–20  సంవత్సరానికి 4100 కోట్ల రూపాయలు అంటే 60% మేర పెంచడం ప్రశంసనీయం. కొన్ని విధాన కార్యక్రమాలు స్వాభావికంగా నిర్వచించతగిన రీతిలో ఉన్నాయి. వాటి  సంచిత ప్రభావం, సంవత్సరాల తరువాత బహిర్గతం అయినప్పుడు (దశాబ్దాల తరువాత కాదు), సమాజం కోసం‘విధిని నిర్వచించేందుకు’  తక్కువేమీ కాదు.ఈ రచయిత దృష్టిలో,ఈ తరహా విధాన ప్రక్రియలలో అతి ముఖ్యమైనది సంపూర్ణ పౌష్టికాహారం కోసం ప్రధాన మంత్రి ప్రారంభించిన విస్తృత పథకం పోషణ్‌ అభియాన్‌ (జాతీయ పౌష్టికాహార మిషన్‌). పోషణ్‌ అభియాన్‌ (POSHAN Abhiyaan)ఎలా పునరుద్ధరించబడింది, పునః రూపకల్పన చేయబడింది, తీర్చిదిద్దబడింది ,స్థిరంగా పర్యవేక్షించబడుతుంది, క్రమాంకనం చేయబడుతుంది అనే విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ పాలసీ ఆలోచన ప్రాముఖ్యత స్పష్టంగా గోచరిస్తుంది. పోషణ్‌ అభియాన్‌ లేదంటే జాతీయ పౌష్టికాహార మిషన్‌ను మహిళలకు చక్కటి ఆరోగ్యం అందించేందుకు తీర్చిదిద్దబడింది, మరీ ముఖ్యంగా గర్భవతులు/పిల్లలకు పాలిస్తున్న తల్లులు, నవజాత శిశువులకు చక్కటి ఆరోగ్యం అందించడంతో పాటుగా వారి ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. ఈ పాలసీని అమలు చేయడమన్నది మాతృమూర్తులుగా మారబోతున్న మహిళలతో పాటుగా నవజాత శిశువులు ,తల్లులకు అత్యంత కీలకమైనది.జీవితం,జీవనం ముఖ్యమైన కోణాలైనటువంటి గర్భం,జన్మనివ్వడం,  శిశువు,మాతృత్వంకు నాణ్యమైన సంరక్షణ, అవగాహన, భరించగలిగేది,స్థానికీకరణ,క్రియాశీల పౌరసత్వ ఆధారిత సామూహిక ఉద్యమం తీసుకురావాలనే ప్రయత్నం ఇది. ఈ లక్ష్యంను అమలు పరంగా అనువదించినప్పుడు మన సమాజంలోని ధనిక, మధ్య తరగతి,నిరుపేదలకు గర్భధారణకు ముందు,గర్భధారణ సమయంలో లభిస్తున్న నాణ్యమైన సంరక్షణ పరంగా స్పష్టమైన తేడా వెల్లడిచేస్తుంది. అదే సమయంలో భావి తరాల,మెరుగైన ఆరోగ్య ప్రొఫైల్‌కూ భరోసా అందిస్తుంది.

A policy process is needed to preserve the future health profile of the country
A policy process is needed to preserve the future health profile of the country

ఈ పాలసీని విజయవంతంగా అమలు చేయడం ద్వారా భావి తరాల ఆరోగ్య ప్రొఫైల్‌ను అధికంగా నిర్ణయిస్తుంది. ప్రాధమిక స్థాయిలో విజయానికి భరోసాను అందించడానికి ,ఈ పాలసీ అమలను నీతి ఆయోగ్‌ క్రియాశీల జోక్యంతో పర్యవేక్షిస్తున్నారు,పురోగతిని నివేదిస్తున్నారు.ఇక్కడ గమనించాల్సింది,ఈ పాలసీ అమలును ఈ విధాలుగా వర్గీకరించబడుతుంది 1) సమర్థవంతంగా సాంకేతికతను వినియోగించడం  2) శిక్షణ, ధోరణి 3) 2022 కోసం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు మైలు రాయి ఆధారిత విధానం 4) స్థిరంగా పర్యవేక్షణ,వృద్ధి పర్యవేక్షణ  5) స్ధానికీకరణ 6) ఉద్దేశించిన విధాన ఫలితాల కోసం ప్రాధమిక స్థాయి నుంచి ఒక పెద్ద ఉద్యమాన్ని ఏర్పాటుచేయడం. ఈ పాలసీ అమలుతో  సామాజిక అసమానతలను పొగొట్టడం సాధ్యం కావడంతో పాటుగా ఆరోగ్య పరంగా లోపాలు అయినటువంటి,నూరుశాతం నివారించతగిన,శిశువులు, స్త్రీల నడుమ పౌష్టికాహారం పరంగా భారీ మార్పును తీసుకురావచ్చు. అదే సమయంలో, రాజకీయ నాయకులు ఈ మహోన్నత కారణం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించాల్సి ఉంది. తద్వారా పాలసీ అమలతో పాటుగా లక్ష్యాలను సాధించడం పట్ల పాలన సమర్థతకు ఋజువుగా నిలుస్తుంది. ఈ పాలసీ అమలు అనేది తప్పనిసరిగా మెరుగుపరిచే రీతిలో విస్తరించతగిన విధంగా ఉండాలి. ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యం, సాంకేతిక వినియోగం పునః రూపకల్పన అమలు వ్యవస్థలు వంటివి ఇప్పుడు తక్షణావసరం.గత వర్షాకాల సమావేశాలు (సెప్టెంబర్‌ 2020)లో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఓ డైట్‌ ప్లాన్‌ను గర్భవతుల కోసం ప్రకటించింది (లోక్‌సభలో). ఆ సమయంలో లోక్‌ సభ స్పీకర్‌, సదరు మంత్రికి ఈ ప్రణాళికలను పార్లమెంట్‌ సభ్యులందరికీ అందించడం ద్వారా వారు తమ సంబంధిత నియోజకవర్గాలలో ప్రచారం చేసేందుకు తగిన అవకాశాలుంటాయని సూచించారు. ఈ డైట్‌ ప్రణాళికను స్థానికీకరించడంతో పాటుగా కావాల్సిన పౌష్టికాహార కంపోజిషన్‌కు సంబంధిత ప్రాంతం/నియోజకవర్గంకు అనుగుణంగా అక్కడి మహిళల పౌష్టికాహార లోపాలను సైతం పరిగణలోకి తీసుకుని ప్రణాళిక చేయడం సాధ్యమవుతుంది.దేశపు దీర్ఘకాల, మధ్యస్థ భవిష్యత్‌ను నిర్ణయించే వ్యక్తిగా, గర్భవతులు, నవజాత శిశువులు మాతృమూర్తుల ఆరోగ్యం కోసం మెరుగైన దృష్టి కేంద్రీకరించడం ప్రశంసనీయం. ఈ రచయిత దృష్టిలో ‘ఈ మెరుగైన దృష్టి’ అనేది విధాన రూపకల్పన కార్యాచరణ ప్రణాళికలో కనిపిస్తుందని భావించడం జరుగుతుంది. ఉదాహరణకు, పోషణ్‌ అభియాన్‌ (జాతీయ పౌష్టికాహార మిషన్‌) న్యూట్రిషనల్‌ ప్రొఫైల్‌కు భరోసా అందించడంతో పాటుగా మహిళలు,గర్భవతులు నవజాత శిశువులకు రక్షణను అందిస్తుంది. ఇటీవలనే అనుమతించిన జాతీయ విద్యావిధానం 2020తో ఇది మరింత బలోపేతం కావడంతో పాటుగా ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ)పై దృష్టి కేంద్రీకరిస్తుంది. దీని పీఠికలోనే ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ,విద్య అనేది అభ్యాసానికి పునాదిగా చెప్పబడింది. ఎన్‌ఈపీ 2020 నిస్సందేహంగా పేర్కొంది పోషణ్‌ అభియాన్‌ ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది) ఏమిటంటే, చిన్నారులకు ఆరేళ్ల లోపు వయసులోనే దాదాపు 85% మెదడు వృద్ధి చెందుతుంది. తద్వారా తగిన సంరక్షణ చిన్నారుల తొలి సంవత్సరాలలో మెదడుకు తగిన పోషణ అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన మెదడు వృద్ధి సాధ్యమవుతుందని శాస్త్రీయంగా గుర్తించింది. ఎన్‌ఈపీ 2020, దానికనుగుణంగానే కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటుగా ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ) ను 8 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం రెండు భాగాలుగా అందించింది. అవి 0–3 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ఉప కార్యాచరణ ప్రణాళిక  3–8 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల కోసం మరో కార్యాచరణ ప్రణాళికను అందించింది. ఈసీసీఈ జాతీయ అంతర్జాతీయ అత్యుత్తమ ప్రక్రియలపై తాజా అధ్యయనాల ప్రకారం ‘‘శతాబ్దాలుగా బాల్య సంరక్షణ కళలు, కథలు,  కవిత్వం.పాటలు, మరెన్నో భాగంగా ఉన్న విద్య పరంగా మహోన్నతమైన స్థానిక సంప్రదాయాలు వృద్ధి చెందాయి. ఈ కార్యాచరణ ప్రణాళిక తల్లిదండ్రులతో పాటుగా విద్యాసంస్థలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది’’.

A policy process is needed to preserve the future health profile of the country
A policy process is needed to preserve the future health profile of the country

మెరుగైన రీతిలో అమలుకు భరోసా కల్పించడం కోసం – విద్యామంత్రిత్వ శాఖ (ఎన్‌ఈపీ 2020) స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల నడుమ ప్రాధమిక స్ధాయి నుంచి నిర్వహణ పరంగా ఏకీకృత సామర్థ్యం పరిగణలోకి తీసుకోవడం అవసరం. ఎన్‌ఈపీలో ఎర్లీ చైల్డ్‌హుడ్‌ గురించి వెల్లడించిన లక్ష్యాలు నిర్వచనం  ఈ విధంగా ఉంది ‘‘దశలవారీగా దేశవ్యాప్తంగా  అత్యున్నత నాణ్యతతో బాల్య సంరక్షణ విద్యాపరంగా ప్రాప్యతను నిర్థారించడం దీని లక్ష్యం’’. ఈ మార్గంలో, పోషణ్‌ అభియాన్‌ (జాతీయ పౌష్టికాహార మిషన్‌) విజయంపై భారీగా ప్రభావం పడటంతో పాటుగా ఎన్‌ఈపీ విజయానికీ తోడ్పడుతుంది. మరీముఖ్యంగా బాల్య సంరక్షణ విద్య (ఈసీసీఈ) కోణంలో !  మన ఉన్నత విద్యా సంస్థల నెట్‌వర్క్‌ సామర్థ్యం వినియోగించుకుని అవగాహన మెరుగుపరచడం నిర్థిష్ట ప్రాంతాలు, పొరుగుప్రాంతాలను స్వీకరించడం ద్వారా ఎం అండ్‌ ఈ ను  నిరంతర ఉపబల పద్ధతిలో చేయడం అవసరం. స్థానిక ప్రాంతీయ, జాతీయ స్ధాయిలో తగిన నోడల్‌ విధానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా మిషన్‌ మోడ్‌ ధోరణిని నిర్ధారిస్తుంది. దీనితో పాటుగా, అట్టడుగున ఉన్న సామాజిక అంశాలపై అవగాహన మెరుగుపరుచుకోవడంలో ఇది విద్యావేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది.విద్యామంత్రిత్వ శాఖ, స్త్రీ శిశు అభివృద్ధి శాఖ,  ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌ల పాలసీల సమ్మేళనం జాతి ప్రయోజనాల పరంగా ఎంతో దూరం వెళ్తాయి. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ధోరణి,  ఫీడ్‌బ్యాక్‌ సేకరణ పర్యవేక్షణ ద్వారా కిందస్ధాయిలో కన్వర్జెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయడం ఈ మిషన్‌ విజయవంతం కావడానికి అట్టడుగు స్థాయి నుంచి సానుకూల వ్యత్యాసాన్ని తీసుకురావడానికి దోహదపడుతుంది.

– డాక్టర్‌ ఆర్‌ పీ రాయ, గౌరవ ఉపాధ్యక్షులు– భారతీయ శిక్షణ్‌ మండల్‌ (బీఎస్‌ఎం) (http://bsmbharat.org/) మరియు ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌)– పాండిశ్చేరి యూనివర్శిటీ (www.profraya.in)