365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 30,2021: అంతర్జాతీయంగా డిజిటల్ స్ట్రాటజీ, డిజిటల్ ఇంజనీరింగ్,ఐటి సర్వీసులు, సొల్యూన్లని అందిస్తున్న వెర్ట్యుసా కార్పొరేషన్ వారు, వారి ప్రముఖ టాలెంట్ హండ్ చొరవ అయిన నెరుల్హ్యాక్ సీజన్ 5 రెండో దశని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నెరుల్హ్యాక్ ఈ ఎడిషన్లో కొత్త ప్రైజ్ విభాగాలు వున్నాయి, రికార్డుస్థాయి రిజిస్ట్రేషన్లు చవిచూసింది. భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు విజేత అవుతారు, 250 మంది పోటీదారులు అగ్రస్థానం పొందడానికి పోటీపడతారు. ఈ సాటిలేని హ్యాకథాన్, కళాశాల విద్యార్థులు డాటా సైన్స్, క్లౌడ్, సిఆర్ఎం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతల్లో నైపుణ్యాలు పెంచి, వృత్తి జీవితాలకి తగినట్టుగా వారిని తయారు చేస్తుంది.
నెరుల్హ్యాక్ని, మొదట్లో జాతీయస్థాయి కోడింగ్ పోటీగా, దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి కళాశాలలూ, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టేరు. ఇదొక వర్ట్యువల్ ఈవెంట్. స్థిరపడుతున్న వాస్తవికతలకి అనుగుణంగా, భవిష్యత్ ఆవిష్కర్తలు కొత్త మెరుగైన డిజిటల్ పరిష్కారాలని సృష్టించడానికి వీలుకలుగుతుంది. నెరుల్హ్యాక్ సీజన్ 5 అనేది, 30 రోజుల హ్యాకథాన్ ఫార్మాట్, ఇందులో ఫైనల్ కి చేరినవారు వాస్తవ ప్రపంచ వ్యాపార వాతావరణంలో, గతిశీలమైన పారిశ్రామిక విభాగాల్లో, అధిక డిమాండ్ వున్న నైపుణ్యాలని గుర్తించడానికి, ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలని సాధించడానికి వీలుకలుగుతుంది.
నెరుల్హ్యాక్, దాని ఐదవ సీజన్లో, ఇప్పుడు, విద్యార్థి సమూహాల్లో చాలా ప్రాథాన్యత సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా వున్న అగ్రశ్రేణి బిజినెస్, ఇంజనీరింగ్ స్కూల్స్ నుంచి ఇంతవరకూ 1,00,000 పైగా రిజిస్ట్రేషన్లు జరిగేయి. ఈ సీజన్లో పలు రౌండ్ల పోటీ జరిగిన తరవాత, 250 మంది ఫైనల్ కి చేరి, మొదటిసారిగా ఫైనల్ రౌండ్ లో పోటీపడతారు. 2021 అక్టోబర్ లో అది 30 రోజులపాటు జరుగుతుంది.
సుందర్ నారాయణన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్, వెర్ట్యుసా, ఈ సందర్భంగా మాట్లాడుతూ, “పరిశ్రమలోను, మా క్లయింట్లు ఎదుర్కొంటున్న కామన్ యూజర్ ఎక్స్పీరియన్స్, డాటా, పెర్ఫార్మెన్స్ సమస్యలకి పరిష్కారాలు నిర్మించడానికిగాను వెర్ట్యుసా, ప్రతి ఏటా, దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి స్కూల్స్, విశ్వవిద్యాలయాల నుంచి ఉత్తమ మేథని ఒక దగ్గరకి తెస్తోంది. విద్యార్థి ప్రపంచంలో నెరుల్హ్యాక్ కి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గుర్తించి, ఈఏడాది, మరిన్ని అవార్డులనికూడా ప్రవేశపెట్టేం. ప్రధాన ప్రైజ్లకు తోడుగా, నాలుగు జోనల్ విన్నర్స్, 28 స్టేట్ విన్నర్స్ లనికూడా కొత్తగా జతచేసేం. వెర్ట్యుసా వారి ఈవెంట్లయిన నెరుల్హ్యాక్, బిజినెస్ సిఫెర్ లు, భారతదేశంలో విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న నైపుణ్యం, ప్రావీణ్యం, సామర్థ్యాలని ప్రదర్శిస్తూ, అత్యుత్తమ టాలెంట్ ని చేర్చుకోడానికి వీలుకలిగిస్తోంది” అన్నారు.
వెర్ట్యుసా న్యాయనిర్ణేతల ప్యానెల్, మొత్తంగా దీన్ని మదింపుచేసి, నెరుల్హ్యాక్ సీజన్ 5 విజేతలని ప్రకటించి, వారికి ఆఫర్ లెటర్లు, నగదు బహుమతులు ప్రకటిస్తారు. సెప్టెంబర్ 20న ప్రారంభమైన హ్యాకథాన్ లో, ఫైనలిస్ట్ ల బృందం కోసం వారం అంతా లెర్నింగ్, అసిమిలేషన్ సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది. సాంకేతికత, భాగస్వామ్యం, సృజనాత్మకత, పోటీ ఆధారంగా వెర్ట్యుసా న్యాయనిర్ణేతల బృందం, ఆ ఫైనలిస్ట్ ల తుది ప్రోటోటైప్స్ ని మదింపు చేసి, అక్టోబర్ చివరి వారంలో విజేతల్ని ప్రకటిస్తుంది. విజేత బృందానికి రూ. 50,000 నగదు బహుమతి, మొదటి, రెండవ రన్నరప్ లకి రూ, 20,000, రూ. 10,000 రూపాయలు అందజేస్తారు. భౌగోళికంగా విస్తృతస్థాయిలో పొల్గొనడంతో, జోనల్, రాష్ట్ర వారీగా విజేతలకి ఈ ఏటి హ్యాకథాన్ లో రివార్డులు వుంటాయి.