365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు,ఆగష్టు 10,2021:దివ్యమైన సువాసనలు,అందమైన రూపంతో మైమరిపింపజేసే పుష్పాలు మన సంస్కృతిలో అంతర్భాగం. సందర్భానికి తగినట్లుగా లభించే పూలను గురించి మనం వెదికినప్పుడు, వినియోగించకుండా వదిలేసిన టన్నుల కొద్ది పూలే ముందుగా స్ఫురణకు వస్తాయి. హూవూ ఫ్రెష్ ఇప్పుడు చేతితో తయారుచేసిన అగరబత్తిలను సమర్పిస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. హూవూ వద్ద మేము పూలు కూడా మన జీవితానికి విలువ తీసుకువస్తుందని నమ్ముతుంటాం. అందువల్ల మేము వాటిని శుద్ధిచేసి సహజసిద్ధమైన బార్క్ పొడి, బైండర్ జొడించి వినూత్నమైన అగరబత్తిలను తయారుచేశాం. మా అగరబత్తిల ద్వారా పూల,అసలైన సువాసనలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
హూవూ వద్ద చేతితో తయారుచేసిన అగరబత్తిలు 100% ఆర్గానిక్. ఈ సువాసనలు గదిలో ఓ విధమైన ప్రశాంతతను తీసుకురావడంతో పాటుగా ఎలాంటి సందర్భానికైనా అనువైన వాతావరణం సృష్టించడంలోనూ సహాయపడతాయి. ఈ అరోమా థెరపాటిక్ అగరబత్తిలను దేవాలయాలోల వాడిన పూలతో తయారు చేశారు. వీటిలో బొగ్గు, రసాయనాలు ఉండవు. ఇవి 30 స్టిక్స్‌తో కూడిన ప్యాక్‌లో వస్తాయి.
‘‘మన వేడుకలలో అవసరమైన భాగంగా పూలు నిలుస్తుంటాయి. అయినప్పటికీ పూసిన పూలలో సగానికి పైగా వ్యర్థమవుతుంటాయి. హూవూ వద్ద మేము ఈ పూలను శుద్ధి చేస్తున్నాం. లేదంటే ఇవన్నీ భూమి, సముద్రాలలో కలిసిపోతుంటాయి. మా సోల్‌ఫుల్ రోజ్ అగరబత్తీలు గదిలో సువాసనలను నింపడంతో పాటుగా సౌకర్యమూ, ఆనందమూ అందిస్తాయి’’ అని హూవూ ఫ్రెష్ ఫౌండర్స్ యశోదా, రేహా కరుటూరి అన్నారు.
2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన హూవూ లక్ష్యం, తాజా పూలను ప్రతి రోజూ అందుబాటు ధరలలో అందించడం. తద్వారా మీరు ప్రతి రోజునూ అందంగా, ఆహ్లాదంగా వేడుక చేయవచ్చు. ఉత్పత్తి శ్రేణిలో అసోర్టెడ్ రోజెస్, అసోర్టెడ్ పూజా ఫ్లవర్స్,గ్రీన్ మిక్సెస్ ఉంటాయి. వీటిని వినియోగదారులు ఇండివిడ్యువల్ బాక్స్‌లు లేదా నెలవారీ చందా చేయడం ద్వారా పొందవచ్చు. తమ వెబ్‌సైట్‌తో పాటుగా బిగ్‌బాస్కెట్, మిల్క్ బాస్కెట్, ఫ్రెష్ టు హోమ్, అమెజాన్ ఫ్రెష్ వంటి ప్లాట్‌ఫామ్స్ పై కూడా ఈ ఉత్పత్తులు లభ్యమవుతాయి.