365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, జూన్ 18,2020: భారతదేశంలో సుప్రసిద్ధ , ప్రీమియర్ ఎనర్జీ మార్కెట్ ప్లాట్‌ఫామ్ ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ నేడు దేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్ డెలివరీ ఆధారిత గ్యాస్ వాణిజ్య కేంద్రం, ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ (ఐజీఎక్స్)ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. గౌరవనీయ పెట్రోలియం , సహజవాయు మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రదాన్, నేడు జరిగిన ఈ-వేడుకలో ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్‌ను ప్రారంభించారు. ఆయన సమక్షంలోనే ఈ వేదికపై వాణిజ్య కార్యకలాపాలను సైతంప్రారంభించారు. వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేజ్‌తో పూర్తి స్వయంచాలకంగా ఉన్నటువంటి ఈ వేదిక, క్లిష్టత లేని వాణిజ్య అనుభవాలను వినియోగదారులకు అందిస్తుంది. ఇది జీమెక్స్ (ఎకఉగీ) నుంచి అత్యుత్తమ శ్రేణి సాంకేతికతను కలిగి ఉంది. ప్రపంచంలో ప్రముఖ డిజిటల్ ఎక్సేంజ్ ట్రేడింగ్, పోస్ట్ ట్రేడ్ టెక్నాలజీ ప్రొవైడర్లలో ఒకరు జీమెక్స్. భారతదేశపు సుప్రసిద్ధ మార్కెట్ వేదిక – ఐఈఎక్స్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఏర్పాటుచేసిన ఐజీఎక్స్, మార్కెట్ లో పాల్గొనేవారికి ప్రామాణిక గ్యాస్ ఒప్పందాలలో వ్యాపారం చేయడానికి వీలు కల్పిస్తుంది.
గౌరవనీయ అతిథులు తరుణ్ కపూర్, సెక్రటరీ, ఎంఓపీఎన్‌జీ మరియు డీ కె సరాఫ్, ఛైర్మన్-పీఎన్‌జీఆర్‌బీ సైతం ఈ-ఆవిష్కరణ సమావేశంలో మాట్లాడటంతో పాటుగా సత్కరించారు. భారతదేశంతో పాటుగా విదేశాలకు చెందిన 1000 మందికి పైగా వర్ట్యువల్‌గా పాల్గొన్నారు.భారతదేశం యొక్క గ్యాస్ మార్కెట్లను సమూలంగా మార్చడంలో ఐజీఎక్స్ అత్యంత కీలకమైన పాత్రను పోషించడమే కాదు, భారతదేశాన్ని స్థిరమైన ఆర్థికవ్యవస్థగా నిలుపడంతో పాటుగా పరిశ్రమలో పోటీతత్త్వాన్ని సైతం వృద్ధి చేయనుంది. ఈ పోటీ ధరల ఆవిష్కరణ భారతదేశమంతా పరిశ్రమల వ్యాప్తంగా క్రాస్ స్పెక్ట్రమ్ కోసం గ్యాస్ లభ్యతను సులభతరం చేస్తుంది. దీనితో పాటుగా డిమాండ్‌ను ఉత్తేజపరిచి, దేశీయ గ్యాస్ అన్వేషణలో ఎక్కువ పెట్టుబడులు వచ్చేందుకు వీలు కల్పిస్తుంది.ఆవిష్కరణ కార్యక్రమంలో రాజీవ్ వాస్తవ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో -ఐఈఎక్స్ మరియు డైరెక్టర్ ఐజీఎక్స్ మాట్లాడుతూ “ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్‌ను ఆవిష్కరించడం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాం. గత 12 నెలలుగా ఐఈఎక్స్ విజయవంతంగా ప్రభుత్వ లక్ష్యమైన విద్యుత్‌ను 24 గంటలూ సాంకేతికాధారిత విద్యుత్ మార్కెట్‌ల ద్వారా అందించగలిగింది. ఇప్పుడు దేశంలో గ్యాస్ మార్కెట్‌లను నిర్మించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యానికి మద్దతునందించడంతో పాటుగా భారతదేశపు ఇంధన రంగంలో గ్యాస్ వాటాను ప్రస్తుతమున్న 6% నుంచి 2030 నాటికి 15% చేర్చగలం” అని అన్నారు. వాస్తవ మరింతగా మాట్లాడుతూ ” పరిశ్రమలో పోటీతత్త్వం, స్థిరత్వం మెరుగుపరచడంతో పాటుగా గ్యాప్ విలువ గొలుసుకట్టులో పెట్టుబడులను సైతం వృద్ధి చేసి పైప్‌లైన్ మౌలిక వసతులను సమర్థవంతంగా అందించడంతో పాటుగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్స్ పునరుద్ధరణకు భరోసా కల్పిస్తుంది.ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ ఇప్పుడు ఆరు మార్కెట్ ఉత్పత్తులను డే- హెడ్ మార్కెట్‌తో ఆరంభించడంతో పాటుగా డెయిలీ, వీక్లీ, వీక్‌డే, ఫోర్ట్‌నైట్లీ , మంత్లీ సహా ఫార్వాడ్ కాంట్రాక్ట్స్‌ను మూడు భౌతిక కేంద్రాలు -గుజరాత్‌లోని దాహేజ్, హజిరా , ఆంధ్రప్రదేశ్‌లోని ఓడోరు వద్ద ప్రారంభిస్తుంది. త్వరలోనే మిగిలిన కేంద్రాల వద్ద కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభించిన తమ సభ్యత్వ డ్రైవ్‌తో ఐజీఎక్స్ ఇప్పటికే 12 సభ్యులను కలిగి ఉంది , సుప్రసిద్ధ పారిశ్రామిక విభాగాల నుంచి 350 నమోదిత క్లయింట్స్‌ను కలిగి ఉంది. హిరేందర్ మిశ్రా, ఛైర్మన్ -జీమెక్స్ టెక్నాలజీస్ మాట్లాడుతూ “ఐజీఎక్స్‌కు వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామి కావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. భవిష్యత్‌కు సంబంధించి విప్లవాత్మక ఇంధన మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటి ఐజీఎక్స్” అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ” భారతదేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఐజీఎక్స్ తీర్చిదిద్దడంతో పాటుగా స్థిరమైన పర్యావరణ ప్రయోజనాలకు సైతం దారి తీస్తుంది” అని అన్నారు.