Tue. Dec 17th, 2024
loan-app-organisers

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా లోన్ యాప్ వేధింపులు తప్పడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయగా, మంత్రి నియోజకవర్గ పర్యటనలో ఉండడంతో మంత్రి పీఏ శంకర్ ఫోన్ లిఫ్ట్ చేయగా..లోన్ యాప్ నిర్వాహకులు రూ. 25,000 కట్టాలని కాల్స్ చేసి వేధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. చెన్నై నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మంత్రినే కాదు మరికొందరు ప్రజాప్రతినిధులను సైతం ఈ లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. అశోక్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రూ.9 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిసింది. అయితే యాప్ నిర్వాహకులు అశోక్ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి ఫోన్లు చేసి వేధిస్తున్నారు. వీరి వేధింపుల కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

loan-app-organisers
error: Content is protected !!