365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి30,హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీ
వులు ఆకలితో అలమటిస్తున్నాయి.ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు. ఉదయం, సాయంత్రం జంట నగరాల్లో పలు చోట్ల ఉండే పక్షుల కడుపు నింపుతూ మానవత్వం ఇంకా మిగిలే ఉన్నదని నిరూపిస్తున్నాడు శశాంక్.



గతంలో కొంతమంది ఆరుబయట కనిపించే పక్షులకు ఆహారం అందించేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. లాక్ డౌన్ కారణంగా జనాలు ఇండ్లకే పరిమితం అయ్యారు. పలు వీధుల్లో ఉండే శునకాలు సైతం తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయి. అటువంటి మూగజీవాలకు కడుపునింపేపనిలో నిమగ్నమయ్యాడు పసుపులేటి శశాంక్. జంట నగరాల్లో ఆకలితో అలమటిస్తున్న వందలాది పక్షులు,శునకాలకు లాక్ డౌన్ అమలు లో ఉన్నన్ని రోజులూ ఆహారం అందిస్తానంటున్నాడీ జంతు ప్రేమికుడు.