365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 22, 2020, హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యం లో ఆసుపత్రులు, బ్లెడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి ముందుకు వచ్చిన ఆయన ఇటీవల రక్తదానం చేసి, తన అభిమానులకు, ఇతర సినిమా తారలకు రక్తదానం చేయాలంటూ పిలుపు నిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పిలుపు అందుకున్న యువ దర్శకుడు డైరెక్టర్ శ్రీధర్ మంగళవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.
“అన్నయ్య బాటలో రక్తదానం చేయడం తనకెంతో ఆనందంగా ఉందని “అన్నారు. “మెగా స్టార్ డమ్ ఉన్న చిరంజీవి గారే సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేస్తుంటే… ఆయన బాటలోనే నడవాలనే కృతనిశ్చయంతో ఆయన పిలుపునకు స్పందించి రక్తదానం చేశానని” యువ దర్శకుడు డైరెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గతం లో కామెడీ షో జబర్దస్త్ లో షకలక శంకర్ స్కిట్స్ కు స్క్రిప్ట్ రా శారు . ఆ తర్వాత డైరెక్షన్ పట్ల ఆసక్తితో.. 2018 లో షకలక శంకర్ తో “శంభోశంకర” సినిమా కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రెండో సినిమా తీసే పనిలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఆపత్కాలం లో ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తున్నదని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి రవణం స్వామినాయుడు తెలిపారు. రక్తదానం … ప్రాణదానం తో సమానమన్న స్లోగన్ తో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సేవలందిస్తున్నదని ఆయన చెప్పారు.