Thu. Nov 14th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అహ్మ‌దాబాద్, న‌వంబ‌ర్ 14, 2024: వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో నిమగ్నమైన, అహ్మదాబాద్‌కు చెందిన మెర్క్యురీ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ (బీఎస్ఈ – 512415) వారి రూ .48.95 కోట్ల రైట్స్ ఇష్యూ 2024 నవంబర్ 7 న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభ‌మ‌వుతుంది.

రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇష్యూ ఖర్చులు, సాధారణ కార్పొరేట్ తదితరాలకు వినియోగించనున్నారు.

నవంబర్ 6, 2024న ఒక్కో షేరు ధర రూ.60.43 ఉండగా, కంపెనీ రైట్స్ ఇష్యూ రూ.44.95కే లభిస్తోంది. రైట్స్ ఇష్యూ డిసెంబర్ 05, 2024న ముగుస్తుంది. మార్చి 2024 నుంచి కంపెనీ త‌ర‌ఫున ఇది రెండో రైట్స్ ఇష్యూ, ప్రతి షేరుకు రూ.40.00 ధరకు మొదటి రైట్స్ ఇష్యూ చేసి రూ. 9.90 కోట్లు సమీకరించింది.

రూ.48.95 కోట్ల విలువైన ఈక్విటీ షేరుకు రూ.44.95 చొప్పున (ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.34.95 ప్రీమియంతో కలిపి) రూ.10 ముఖ విలువ కలిగిన 1,08,90,000 ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ప్రతిపాదిత ఇష్యూ కోసం హక్కుల అర్హత నిష్పత్తి 4:1 గా నిర్ణయించారు.

(రికార్డు తేదీ – అక్టోబర్ 24, 2024 న ఈక్విటీ వాటాదారులు కలిగి ఉన్న ప్రతి ఒక్క పూర్తిగా చెల్లించిన‌ ఈక్విటీ షేరుకు రూ. 10 ముఖ విలువ కలిగిన 4 రైట్స్ ఈక్విటీ షేర్లు). ఆన్-మార్కెట్ హక్కుల ఉపసంహరణకు చివరి తేదీ 2024 నవంబర్ 29 వరకు.

ఇష్యూ ద్వారా వచ్చిన రూ.48.95 కోట్లలో రూ. 36.94 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.25 లక్షలు రైట్స్ ఇష్యూ ఖర్చులకు, రూ.11.76 కోట్లను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని కంపెనీ భావిస్తోంది.

error: Content is protected !!