365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, జూలై 19,2023: యూకేలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్ £4 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. దీంతో సప్లయ్ చైన్‌లో వేల మందికి ఉద్యోగాలు అందించనుంది టాటా..
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఇది దేశ ఆటోమోటివ్ పరిశ్రమకు గర్వకారణమని, ఇది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, దాని కార్మికుల బలాన్ని చూపుతుందని అన్నారు. ఇది 4,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు, సరఫరా గొలుసులో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదే సమయంలో బ్యాటరీ టెక్నాలజీలో వృద్ధిని పెంచుతుందని, మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సహాయపడుతుందని సునక్ చెప్పారు.
జాగ్వార్ మాతృ సంస్థ: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ‘టాటా మోటార్స్’ యాజమాన్యంలో ఉంది. ఇది 40 GWh ప్రారంభ ఉత్పత్తితో ప్లాంట్ ప్రధాన కస్టమర్ అవుతుంది. ఈ కొత్త గిగాఫ్యాక్టరీ పని 2026లో ప్రారంభంకానుంది.
టాటా మోటార్స్ షేర్లు: టాటా మోటార్స్ షేరు ధరలో విపరీతంగా పెరిగింది. ట్రేడింగ్ సమయంలో టాటా మోటార్స్ షేరు1.50% పెరిగి రూ.625.15కి చేరుకుంది.