365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 24,హైదరాబాద్ 2020: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేసారు. మెగాస్టార్ చిరంజీవి పిలుపునకు స్పందించి తనవంతుగా రక్తదానం చేశానని అన్నారు.
చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగానని, ఆర్టిస్ట్‌గా ఎదుగుతున్న క్రమంలో ఆయన స్ఫూర్తి తనకు ప్రేరణగా నిలిచిందని గెటప్ శ్రీను పేర్కొన్నారు. మెగాస్టార్ స్క్రీన్‌పై హీరో మాత్రమే కాదని, రియల్ లైఫ్‌లోనూ హీరోలా ఎంతో మందికి నిలుస్తున్నారని చెప్పారు. జబర్దస్త్ గెటప్ శ్రీను ఆర్టిస్ట్‌గా మరింత ఎదగాలని… ఇదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి రవణం స్వామినాయుడు కోరారు.