365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఏప్రిల్ 26,2020 : మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రక్తదానం పిలుపు మెగా అభిమానులనే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంతున్నది. స్వచ్ఛందంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు వచ్చి రక్తదానం చేసి మెగాస్టార్ పట్ల అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగానే మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ ఎం.ఎన్.ఆర్ జ్యోతి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.
మున్సిపల్ కమిషనర్ గా అన్ని వర్గాలవారికి సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు జ్యోతి . ఈ సందర్భంగా చిరంజీవి ఐ , బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి రవణం స్వామినాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రక్తదానం పిలుపు మెగా అభిమానులనే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకోవడం సంతోషించ తగ్గ విషయం అన్నారు. చిరంజీవి పిలుపునకు స్పందించి రక్తదానం చేసిన మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నదని ఆయన తెలిపారు.