365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, డిసెంబర్ 31,2020 ః పరిశోధనాధారిత ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (గ్లెన్‌మార్క్) ఇప్పుడు తమ విప్లవాత్మక, పేటెంట్ చేత కాపాడబడుతున్న,అంతర్జాతీయంగా శోధించబడిన సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్‌పోర్టర్ ఇన్హిబిటర్ (ఎస్‌జీఎల్ టీ 2ఐ) – రెమోగ్లిఫ్లాజిన్ ఇటాబోనేట్,విస్తృతంగా వినియోగించేటటువంటి డీపీపీ4 ఇన్హిబిటర్ (డిపెప్టీడిల్ పెప్టిడాస్ 4 ఇన్హిబిటర్)– విడాగ్లిప్టిన్,స్థిరమోతాదు సమ్మేళనం (ఎఫ్‌డీసీ)ను భారతదేశంలో ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్థిరమోతాదు సమ్మేళనం (ఎఫ్‌డీసీ)ను టైప్ 2 మధుమేహ నిర్వహణకోసం వాడుతుంటారు. ఈ సమ్మేళనంలో రెమోగ్లిఫ్లాజిన్ (100ఎంజీ)+విడాగ్లిప్టిన్ (50ఎంజీ) వంటివి స్థిరమోతాదులో లభ్యమవుతాయి. వీటిని రోగులలో గ్లైసెమిక్ స్థాయి నియంత్రణను మెరుగుపరిచేందుకు తప్పని సరిగా రోజుకు రెండుసార్లు వాడాల్సి ఉంటుంది. ఈ మోతాదును రెమో వీ,రెమోజెన్ వీ పేరిట గ్లెన్‌మార్క్ ఆవిష్కరించింది.రెమోగ్లిఫ్లాజిన్ (100ఎంజీ)+విల్డాగ్లిప్టిన్ (50ఎంజీ) స్థిరమైన మోతాదు సమ్మేళనం (ఎఫ్‌డీసీ)లో ఆవిష్కరిస్తోన్న ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా గ్లెన్‌మార్క్ నిలిచింది. అంతేకాదు, భారతదేశంలో ఈ ఎఫ్‌డీసీ డ్రగ్‌కు అనుమతి పొందిన మొదటి సంస్ధ కూడా ఇది. గ్లెన్‌మార్క్ ఈ అనుమతులను డిసీజీఐ (డ్రగ్ అప్రూవల్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి అందుకుంది.
నవంబర్ 2020లో రెమోగ్లిఫ్లాజిన్+ విల్డాగ్లిప్టిన్ సమ్మేళనంలో ఔషదం తయారుచేసి మార్కెటింగ్ చేయడానికి అనుమతులు పొందింది.అంతర్జాతీయంగా, ఎస్‌జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు మరియు డీపీపీ4 ఇన్హిబిటర్లు వంటివి టైప్ 2 మధుమేహ చికిత్సలో ప్రాధాన్యతా చికిత్సావకాశంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో మధుమేహంతో బాధపడుతున్న రోగులకు అతి తక్కువ ఖర్చులోని చికిత్సావకాశాన్ని ఇది అందిస్తుంది.అతి తీవ్రమైన టైప్ 2 మధుమేహం లాంటి వ్యాధులలో, రోగులను పలు యాంటీ డయామెటిక్ ఔషదాలను దీర్ఘకాలం పాటు తీసుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అంతేకాదు, భారతదేశంలో, ఔషదాల కోసం రోగులు తమంతట తాముగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల ఔషదాల ఖర్చు అనేది చికిత్స సమయంలో అతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇదే తరహా ఔషద విభాగంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చికిత్సవకాశాల వల్ల ఎదురయ్యే రోజువారీ ఖర్చు దాదాపు 78 రూపాయలుగా ఉంది. గ్లెన్‌మార్క్ యొక్క రెమోగ్లిఫ్లాజిన్+ విల్డాగిప్టిన్ సమ్మేళన ధర కేవలం 14 రూపాయలు. రోజుకు రెండు మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. తద్వారా చికిత్స ఖర్చు రోజుకు 28 రూపాయలుగా మాత్రమే ఉంటుంది. అందుబాటులోనిఇతర ఎస్‌జీఎల్‌టీ2 డీపీపీ4 సమ్మేళ నపు ఔషదాలతో పోలిస్తే ఖర్చు 65% తక్కువగానే ఉంటుంది.గ్లెన్‌మార్క్ రెమోగ్లిఫ్లాజిన్ +విల్డాగ్లిప్టిన్ సమ్మేళనం గణనీయంగా ప్రాప్యతను పెంచడంతో పాటుగా ప్రపంచశ్రేణి,సంపూర్ణ పరిశోధనలు చేసిన ఉత్పత్తులను భారతదేశంలో రోగులకు పూర్తి అందుబాటు ధరలో తీసుకువస్తుంది.
భారతదేశంలో డీసీజీఐ అనుమతి పొందిన ఈఔషదాన్ని 18 సంవత్సరాలు దాటి టైప్ 2 మఽధుమేహంతో బాధపడుతున్న రోగులలో గ్లైసెమిక్ నియంత్రణ కోసం వినియోగించవచ్చు. మరీముఖ్యంగా మెటాఫార్మిన్ . ఫిక్స్‌డ్ డోస్ సమ్మేళనంలలోని మోనో–కంపోనెంట్స్ తగినంతగా గ్లెసెమిక్ నియంత్రణ అందించలేకపోయినా లేదా ఇప్పటికే రెమోగ్లిఫ్లాజిన్,విల్డాగ్లిప్టిన్‌ను ప్రత్యేక డోసులుగా వాడుతున్నా వినియోగించవచ్చు. ‘‘భారతదేశంలో మధుమేహ రోగులకు అత్యాధునిక చికిత్సావకాశాలను అందిచడంలో అగ్రగామిగా గ్లెన్‌మార్క్ వెలుగొందుతుంది. ఈ సృజనాత్మక స్థిర మోతాదు సమ్మేళనాన్ని పరిచయం చేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇది విప్లవాత్మకమైనది,విస్తృత స్థాయి పరిశోధనలను సైతం చేయబడింది. దేశవ్యాప్తంగా రోగులకు అత్యంత అందుబాటు ధరలో ఇది లభిస్తుంది. గ్లెన్‌మార్క్ దృష్టి కేంద్రీకరించిన అతి కీలకమైన విభాగం మధుమేహం. ఈ ఉత్పత్తి ఆవిష్కరణతో మధుమేహ చికిత్స పరంగా మా ప్రాప్యతను మెరుగుపరచడంతో పాటుగా ప్రభావవంతమైన, అత్యున్నత నాణ్యత కలిగిన, ప్రపంచశ్రేణి, అందుబాటుధరలలోని చికిత్సావకాశాన్ని భారతదేశంలోని రోగులకు తీసుకువస్తున్నాం’’ అని శ్రీ అలోక్ మాలిక్, గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్, ఇండియా ఫార్ములేషన్స్ అన్నారు.2015లో మధుమేహ మార్కెట్‌లో విప్లవాన్ని గ్లెన్‌మార్క్ తమ డీపీపీ4 ఇన్హిబిటర్ –టెనెలిగ్లిప్టిన్‌ను ఆ సమయంలో భారతదేశంలో అందుబాటులో ఉన్న ఇతర డీపీపీ4 ఇన్హిబిటర్లతో పోలిస్తే 55% తక్కువ ధరతో విడుదల చేయడం ద్వారా సాధించింది. ఆ వారసత్వం కొనసాగిస్తూ 2019లో రెమోగ్లిఫ్లాజిన్‌ను ఆ సమయంలో మార్కెట్‌లో అందుబాటులోని ఎస్‌జీఎల్‌టీ 2 ఇన్హిబిటర్ల కన్నా 55% తక్కువగా విడుదల చేసింది.