Mon. Dec 23rd, 2024
Hero Ajith-Kumar

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై,జూలై 31,2022: తమిళ నటుడు అజిత్ కుమార్ సినిమాలోనేకాదు రియల్ లైఫ్ లోనూ హీరోగా నిరూపించుకు న్నారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్ టోర్నమెంట్‌లో సౌత్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ జట్టు నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. వివిధ విభాగాల్లో అజిత్ టీమ్ ఆరు పతకాలను గెలుచుకుంది.

Hero Ajith-Kumar

మొత్తం ఆరు పతకాలలో నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలు అజిత్ కుమార్ అతని బృందం తిరుచ్చిలో జరిగిన రైఫిల్ షూటింగ్ మ్యాచ్‌లో గెలుచుకు న్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో పిస్టల్ విభాగంలో విజేతలుగా నిలిచిన 162 మందికి అవార్డులు, సర్టిఫికెట్లను జూలై 29న రిటైర్డ్ డీజీపీ దేవరాం అందజేశారు.

సెంటర్ ఫైర్ పిస్టల్ మాస్టర్ పురుషుల టీమ్ విభాగంలో అజిత్ కుమార్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషుల విభాగంలో బంగారు పతకం, 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ మాస్టర్ పురుషుల జట్టు విభాగంలో కాంస్య పతకం, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషులకు 50 మీటర్ల మాస్టర్ పురుషుల విభాగంలో బంగారు పతకం స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించారు.

Hero Ajith-Kumar

ఈవెంట్ కు సంబంధించిన అజిత్ చిత్రాలను కొంతమంది జనాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ హీరోను ప్రశంసించారు. 51ఏళ్ల వయసులోనూ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలను గెలుచుకున్న అజిత్ కుమార్ సూపర్ అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తు తున్నారు. గతంలో ఫార్ములా టూలోనూ పాల్గొని ఛాంపియన్ గా నిరూపించుకున్నారు. అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్ వినోద్‌తో AK 61 ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు.

error: Content is protected !!