PhonePe sees over 150% growth in loan EMI repayments post lockdown PhonePe sees over 150% growth in loan EMI repayments post lockdown

365తెలుగు డాట కామ్ ఆన్లైన్, న్యూస్,India, 2020: బజాజ్ సంస్థ లాంటి సంస్థల ఆధ్వర్యంలో మార్చి 2020 తర్వాత తన వేదికలోని రుణ EMI  రీపేమెంట్ల విభాగంలో 150%కు పైగా వృద్ధి కనిపించిందని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe నేడు ప్రకటించింది. ప్రస్తుతం అది తన వేదికలో 60 రుణదాతలను కలుపుకుంది. తద్వారా ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా తన వినియోగదారులు సులభంగా, సకాలంలో రుణారను రీపేమెంట్ చేసేందుకు వీలు కల్పించింది. బజాజ్ ఫైనాన్స్, హోమ్ క్రెడిట్, ముత్తూట్, DMI ఫైనాన్స్, హీరో ఫిన్ కార్ప్, టాటా క్యాపిటల్ లాంటి దేశంలోని కొన్ని భారీ నాన్-బ్యాంకింగ్ రుణదాతలతో ఈ వేదిక ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.  తద్వారా ఇది తన 200 మిలియన్ల పైగా వినియోగదారుల యొక్క అన్ని రకాల రుణ రీపేమెంట్ అవసరాలను తీర్చే ఒక సమగ్రమైన గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ రుణదాతల్లో సూక్ష్మ రుణాలు, గృహ రుణాలు, గృహ వినియోగవస్తువుల రుణాలు, స్వల్పకాలిక నగదు రుణాలు లాంటి వాటిని అందించే రుణ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. 

ఈ పరిణామంపై PhonePe ఆన్‌లైన్ బిజినెస్, ఇన్-యాప్ విభాగాలు, స్విచ్ BD అంకిత్ గౌర్ మాట్లాడుతూ, “హోమ్ క్రెడిట్, బజాజ్ ఫైనాన్స్ తదితరాల్లాంటి భారీ సంస్థలకు తక్షణ యాక్సెస్ ఇవ్వడం ద్వారా మేము రుణదాతలను సులభంగా కనుగొనే వీలు కల్పించాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు చేయడాన్ని సులభతరం చేసే రీతిలో కేవలం 4 దశలతో వినియోగదారులకు అనువైన ప్రక్రియను ఏర్పాటు చేశాము. మా వేదికను ఉపయోగించి రుణ రీపేమెంట్ చేయడం కోసం మా వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుంను కూడా మేము వసూలు చేయడం లేదు. అంతేకాక,  దేశవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉండడంతో పాటు తెరవెనుక సమ్మిళితం చేసే నిరంతరాయ టెక్నాలజీ ఉండడంతో రుణ సేవా సంస్థలు కూడా మా వేదికను ఆకర్షణీయమైనదిగా భావిస్తున్నాయి.  దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారుల అవసరాలను తీర్చేలా మా రుణ సేవా సంస్థల పునాదిని విస్తృతి చేసేందుకు మేము చురుగ్గా పని చేస్తున్నాము. ” అని అన్నారు.  బజాజ్ ఫైనాన్స్ రుణ కార్యకలాపాల విభాగం అధ్యక్షుడు కురుష్ ఇరానీ మాట్లాడుతూ, “వినియోగదారులు రుణ రీపేమెంట్లు చేసేందుకు  PhonePeలో సంపూర్ణమైన సౌలభ్యం, తేలికైన విధానం ఉందనే విషయం గడచిన 3 నెలల్లో అది మాకు ప్రత్యక్షమంగా  చూపించిన వేగం ద్వారా సుస్పష్టమైంది. PhonePe మరియు BBPSతో మా భాగస్వామ్యం తప్పిపోయిన పేమెంట్లను వసూలు చేసేందుకు, డిజిటల్ వసూళ్లకు వీలు కల్పించేందుకు ఉపయోగపడుతూనే, వినియోగదారులకు ఇబ్బందులు లేని అనుభవాన్ని అందించాలనే మా విధానంతో ముడిపడి ఉంది. ” అని అన్నారు. యాప్ లో నాలుగు తేలికపాటి దశలను అనుసరించడం ద్వారా PhonePe వినియోగదారులు తమ రుణ EMIలను క్షణాల్లో పే చేయవచ్చు. UPI, డెబిట్ కార్డు లేదా PhonePe వాలెట్ ను ఉపయోగించి, పేమెంట్ చేసే ముందు జాబితా నుంచి రుణదాత పేరును ఎంచుకుని, రుణ ఖాతా నెంబర్, రుణగ్రహీత పేరు, మొబైల్ నెంబర్ లాంటి ప్రాథమిక వివరాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.