365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 26,2020,ముంబై :అమెజాన్ నేడిక్కడ ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమం ఆవిష్కరణను ప్రకటించింది. అన్నివిభాగాలకు చెందిన లోకల్ షాప్ కీపర్స్ , రిటైలర్లకు ఈ కార్యక్రమం ఇ-కామర్స్ ప్రయోజనాలను అంది స్తుంది. సాధారణ పరిధిని మించి విని యోగదారులను చేరుకునేందుకు ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమం తోడ్పడనున్నది. ఇందులో భాగంగా అన్నివిభాగాలకు చెందిన లోకల్ షాప్ కీ పర్స్ , రిటైలర్లకు భారతదేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో విక్రయించేం దుకు అమెజాన్ తన సాంకేతికత, శిక్షణ , ఎనేబుల్ మెంట్ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తుంది. ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ లో చేరే దుకాణదారులు నగరం లో వేగంగా డెలివరీ చేసేందుకు తమ ప్రస్తుత డెలివరీ సెటప్స్ ను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ , పికప్ పాయింట్లు గా వ్యవహరించేం దుకు ‘ఐ హావ్ స్పేస్’, అదనపు ఆదాయం పొందేందుకు గాను తమ వాక్ – ఇన్ కస్టమర్లకు తమ ఎంపికను విస్తృ తం చేసుకునేందుకు గాను ‘అమెజాన్ ఈజీ’ని ఆఫర్ చేయవచ్చు.
భారతదేశవ్యాప్తంగా 5000కు పైగా లోకల్ షాప్స్ , రిటైలర్లు ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అటువంటి వారిలో వందలాది మంది ఈ క్లిష్ట సమయంలో వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఆన్ లైన్ లో , ఆఫ్ లైన్ షాపింగ్ అనుభూతులలో ఉండే అత్యుత్తమమైన వాటిని అందించే ఈ ప్రోగ్రామ్ వినియోగదారులు తమ కు చేరువలో ఉండే తమ అభిమాన లోకల్ షాప్స్ లో షాపింగ్ ను తమకు సౌకర్యవంతంగా ఉండేలా ఇంటి నుంచే చేసుకు నేందుకు వీలు కల్పించేలా రూపొందించారు. ప్రముఖ మెట్రోలతో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, జైపూర్, అహ్మదా బాద్, కోయంబత్తూరు, సూరత్, ఇండోర్, లఖ్ నవు, సహరాన్ పూర్, ఫరీదాబాద్, కోట, వారణాసి లాంటి ప్రథమ, ద్వితీ య శ్రేణి నగరాలకు చెందిన రిటైలర్లు వీరిలో ఉన్నారు.
ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటికే భాగంగా ఉన్న లోకల్ షాప్స్ అండ్ రిటైలర్స్ లో ఢిల్లీ ఎలక్ట్రానిక్స్ ప్లాజా (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఢిల్లీ), మై స్లీపీ హెడ్ (మ్యాట్రెసెస్, కృష్ణగిరి), గ్రీన్ సోల్ (ఫర్నీచర్, ముంబై), సంగీతా మొబైల్స్ (మొబైల్ ఫోన్స్, బెంగళూ రు), ఆర్య ఆర్గానిక్ ప్రోడక్ట్స్ (గ్రాసరీ కన్జ్యూమబుల్స్, బెంగళూరు), కంఫర్ట్ బెడ్డింగ్ (బెడ్డింగ్ అండ్ మ్యాట్రసెస్, ఢిల్లీ), షూ మిస్త్రీ (షూస్ కేర్, ఢిల్లీ), ఎలక్ట్రో కార్ట్ (ఢిల్లీ ఎన్సీఆర్), మధురం ఎలక్ట్రానిక్స్ (అహ్మదాబాద్), ది మ్యాట్రెస్ హబ్ (ఢిల్లీ ఎ న్సీఆర్), ఎలక్ట్రానిక్స్ షాపీ (ఢిల్లీ ఎన్సీఆర్), అదిత్ ఎలక్ట్రానిక్స్, రా ప్రెసెరీ (బీవరేజెస్, ముంబై), వెగురాంటీ (గ్రాసరీ అండ్ హెల్త్ కేర్, లఖ్ నవూ) లాంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీసెస్ వీపీ గోపాల్ పిళ్లై మాట్లాడుతూ, ‘‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్ అనే ది దేశంలో ఎక్కడ ఉండే ప్రతీ మోటివేటెడ్ విక్రేత కూడా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను చేరుకునేలా చేయడంపై మేము దృష్టి వహించిన దానికి అనుగుణంగానే ఉంది. వినియోగదారులు, చిన్న కిరాణా దుకాణం యాజమానులు ప్రయోజనం కలుగుతుందన్నారు.