Sat. Nov 9th, 2024
SBI General puts a foot forward to help the flood affected SMEs in AP & Telangana

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 26, 2020: ఇండియాలో ప్రముఖ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్.బి.ఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ లోని వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల సహాయం కోసం ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసింది.ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ లో వచ్చిన వరదలు ఆస్తులు, రోడ్లు, వ్యాపారాలు,పంటలకు విస్తృతమైన నష్టం కలిగించాయి; ఈ కారణంగా, అక్టోబర్ 2020 లో తెలంగాణ లోని హైదరాబాద్ రంగారెడ్డి,నల్గొండ, వికారాబాద్. సంగా రెడ్డి, కామా రెడ్డి, మెదక్, సిద్ధి పేట, కరీమ్ నగర్, యాదగిరి, భువనగిరి జిల్లాలలో, అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి,విశాఖపట్నం జిల్లాలలో విపరీతమైన విధ్వంసం ఏర్పడింది.ఒక బాధ్యతాయుత బ్రాండుగా. ఎస్.బి.ఐ జనరల్, ముందుకొచ్చి ఈ జిల్లాలలోని వినియోగదారులను సంప్రదిస్తూ, ఇన్స్యూరెన్స్  క్లైములకు వీలైన నష్టాలు ఉంటే తెలియజేయ వలసిందిగా తెలియజేసింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన క్లైములను త్వరగా పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకుంది. ఈ అకస్మాత్తు వరదలు, తయారీ యూనిట్స్, ఫ్యాక్టరీలు, షాపులు ,గోడౌనులు కలిగిన అనేక ఎస్.ఎమ్.ఇ ల వ్యాపారాలను అస్తవ్యస్తంగా మార్చింది. మొత్తం మీద, ఎస్.బి.ఐ.జి వద్ద ఈ ఎస్.ఎమ్.ఇ లకు సంబంధించిన 120 ప్రాపర్టీ క్లైమ్స్ విచారించి సహాయక చర్యలతో, వీరి వ్యాపారాలు మళ్లీ నిలదొక్కుకుని కొనసాగేందుకు మేము సాహాయం అందించాం.

SBI General puts a foot forward to help the flood affected SMEs in AP & Telangana
SBI General puts a foot forward to help the flood affected SMEs in AP & Telangana

పిసి కందపాల్, ఎమ్.డి & సిఇఒ, ఎస్.బి.ఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఇలా అన్నారు, “మేము వివిధ సంచార మాధ్యమాల ద్వారా, మా పాలిసీ హోల్డర్లకు, తమ క్లైమ్ సెటిల్ మెంట్ల కోసం మాతో సంప్రదించే వివిధ పద్ధతులు గురించి తెలియ జేసాము.ఈ వరదల అనంతరం, ఆస్తులు,వ్యాపారాల నష్టాలకు సంబంధించిన 120కి పైగా క్లైములు,100 మోటారు క్లైములు మాకు అందాయి. అత్యధిక క్లైములు హైదరాబాద్, దాని ఇరుగుపొరుగు జిల్లాల నుంచి వచ్చాయి. ఆస్తుల మీద జరిగిన ఈ నష్టాల ప్రభావాన్ని మనసులో ఉంచుకుని త్వరిత చర్య పద్ధతిలో , ఆగిపోయిన వ్యాపారాల క్లైములను మేము సెటిల్ చేసాము. ఇటీవల ఏర్పడిన ఈ వరదల కారణంగా నష్టాలు ఏర్పడిన మా కస్టమర్లు మమ్మల్ని సంప్రదించ వలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. ”ఆయన ఇంకా ఇలా అన్నారు, “ఈ మధ్య కాలంలో తమిళనాడు, పాడిచ్చేరి , తీరప్రాంత ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడే సైక్లోన్ నివార గురించి మాకు సమాచారం అందింది. ఇబ్బంది లేని క్లైమ్ సేవలు అందించే క్రమంలో, మా పాలసీ హోల్డర్లకు అవసరమైన ఏర్పాట్లు మేము చేసాము. ”

error: Content is protected !!