Fri. Dec 13th, 2024
Yamaha launches online sales through new website with VIRTUAL STORE

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,చెన్నై, ఆగస్టు 13, 2020:తమ వ్యూహాత్మక ప్రచారం ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’లో భాగంగా వినియోగదారులకు ఉత్సాహ పూరితమైన అనుభవాలను అందించాలనే  బ్రాండ్‌ స్థిరమైన ప్రయత్నాలలో భాగంగా ఆన్‌లైన్‌ అమ్మకాల సదుపాయంతో నూతన వినియోగదారుల అనుకూల వెబ్‌సైట్‌ను భారతదేశంలో నేడు పరిచయం చేయడం ద్వారా ఉత్సాహాన్ని మరింత ఉన్నతస్ధాయికి యమహా తీసుకువెళ్లడానికి సిద్ధమైంది.ప్రస్తుత వాతావరణంలో, వినియోగదారులు ఇంటిలోపలనే ఉండటానికి ఇష్టపడుతున్నారు,షోరూమ్‌లను సందర్శించడాన్ని వీలైనంతగా తగ్గించుకుంటున్నారు. వినియోగదారుల సౌకర్యం పరిగణలోకి తీసుకుని ఇండియా యమహా మోటార్‌ ఇప్పుడు తమ వెబ్‌సైట్‌పై వర్ట్యువల్‌ స్టోర్‌ ద్వారా ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించింది. తద్వారా తమ వినియోగదారుల కొనుగోలు అనుభవాలను వృద్ధి చేసింది.ఈ నూతన వెబ్‌సైట్‌లో అత్యాధునిక ఫీచర్లు అయినటువంటి వర్ట్యువల్‌ స్టోర్‌ ఉంది. దీనిలో ఉత్పత్తులను సంపూర్ణంగా వీక్షించే అవకాశంతో పాటుగా యమహా ఉత్పత్తుల నడుమ ప్రమాణాలను సరిపోల్చుకునే అవకాశాన్ని సైతం తమ వెబ్‌సైట్‌పై ‘బయ్యర్స్‌ గైడ్‌ ’అవకాశం ద్వారా అందిస్తున్నారు. యమహా డీలర్‌షిప్‌లు సైతం కాంటాక్ట్‌లెస్‌ డెలివరీని ప్రోత్సహించడం, వాట్సాప్‌ లాంటి డిజిటల్‌ ఉపకరణాలను వినియోగదారులతో సమాచార సంబంధాలను నెరవేర్చడం కోసం  వినియోగించడం ద్వారా తమ మద్దతును అందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా, వినియోగదారులు  అతను/ఆమె అవసరాలకనుగుణంగా తమ కొనుగోలు సంబంధిత సందేహాలకోసం ఇంటి ముంగిట సేవలను సైతం ఎంచుకోవచ్చు.

Yamaha launches online sales through new website with VIRTUAL STORE
Yamaha launches online sales through new website with VIRTUAL STORE

ఈ సందర్భంగా శ్రీ మోటోఫ్యుమి షితారా, ఛైర్మన్‌, యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మాట్లాడుతూ ‘‘ భవిష్యత్‌ అంతా డిజిటల్‌ కానుంది. మా నూతన వెబ్‌సైట్‌ ఇప్పుడు వర్ట్యువల్‌ స్టోర్‌ ఫీచర్‌  కలిగి ఉండటం వల్ల మెరుగైన కొనుగోలు అనుభవాలను ,వ్యక్తిగతీకరించిన వినియోగదారుల సేవలు (ముఖాముఖి సేవలు)ను భారతదేశంలోని ద్విచక్రవాహన కొనుగోలుదారులకు అందిస్తుంది. ఉత్సాహాన్ని అందించాలనే యమహా సిద్ధాంతం నూతన యమహా వెబ్‌సైట్‌తో వినియోగదారుల అంచనాలకు ఆవల ఉండటంతో పాటుగా సురక్షితమైన, విశ్వసనీయ, అనుసంధానిత ఆన్‌లైన్‌ పోర్టల్‌  shop.yamaha-motor-india.com తో  డిజిటల్‌ రూపాంతరతను వేగవంతం చేయడం ద్వారా నూతన అధ్యాయాన్ని తెరుస్తుంది. ఈ నేపథ్యానికి మరింత సృజనాత్మకతను తీసుకువస్తూ, భవిష్యత్‌లో మా వినియోగదారులు అప్పెరల్ ,యాక్ససరీలను ఇదే ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసే అవకాశం పొందుతారు. తద్వారా మెరుగైన కొనుగోలు అనుభవాలతో సంసిద్ధత కలిగిన పరిష్కారాలను అందించనున్నాం. మా ప్రస్తుత అమ్మకం తరువాత కార్యక్రమాలైనటువంటి విస్తరించిన వారెంటీ ఆఫర్లు, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ వంటివి వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి’’ అని అన్నారు. యమహా తమ ఆన్‌లైన్‌ అమ్మకాల ను చెన్నైలో ఆరంభించి, 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా 300కు పైగా డీలర్‌షిప్‌లకు విస్తరించనుంది

error: Content is protected !!