365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 29, 2020:తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ పీ హెచ్ డీ ఏ),తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) , టీ ఎంపీ హెచ్ జేఏసీ తరపున వైద్యులు శనివారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. ప్రవీణ్ రెడ్డిను గుర్తు తెలియని వ్యక్తులు ఆగస్టు 27 న దాడి చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించి శిక్షించాలని టీ పీ హెచ్ డీ ఏ, టీజీజీడీఏ, టీఎంపీహెచ్ జేఏసీలకు చెందిన వైద్యులు ఫిర్యాదు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది పై దాడులు చేయడం తగదని,… ఈ సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ సందర్భంగా దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు, టీఎంపీ హెచ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి , టీజీజీడీఏ సెక్రటరీ షరీఫ్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , టీఎంపీ హెచ్ జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ డా .కత్తి జనార్దన్, స్టేట్ సెక్రటరీ డా. ప్రవీణ్ స్టేట్ సెక్రటరీ, డాక్టర్ అభిరామ్ లు ఉన్నారు