
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 26,2021: రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు గురువారం కలిశారు.

స్వరూపానందకు శ్రీవారి ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ చేపట్టిన హిందూధార్మిక కార్యక్రమాలు, కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న నవనీత సేవ గురించి వివరించారు. కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతి పాల్గొన్నారు.