365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 15,2020 హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. రక్తదానం చేసేవారు లేక ఆసుపత్రులు,బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వ లు పూర్తిగా పడిపోయాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకడం చాలా కష్టంగా మారింది.
ఈ విషయాన్ని తెలుసుకున్నమిర్యాలగూడ వాసి భువనగిరి కిషన్ పటేల్ తన కొడుకు నిఖిల్ శ్రీవాత్సవ పుట్టిన రోజు సందర్భంగా నల్లగొండ రెడ్ క్రాస్ సొసైటీ లో ఇద్దరూ రక్తదానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అత్యవసర సమయంలో బ్లడ్ అందించడానికి రక్త దాతలందరూ ముందుకు వచ్చి తమ దగ్గరలోని బ్లడ్ బ్యాంకు లు,ఆసుపత్రుల్లో రక్తదానం చేయాలంటూ భువనగిరి కిషన్ పటేల్ “బ్లడ్ డోనేషన్ ఛాలెంజ్”ను ప్రారంభించారు.
” లాక్ డౌన్ ప్రభావంతో బ్లడ్ బ్యాంకులు,దవాఖానాల్లో రక్తం నిల్వలు తగ్గిపోతుండడంతో రక్తదానం చేయాల్సింది గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ” భువనగిరి కిషన్ పటేల్ ,తన కుమారుడు నిఖిల్ శ్రీవాత్సవ తో కలిసి రక్తదానం చేశామ”ని, ” ఈ ఆపదకాలం లో రక్తం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని సినిమా సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు,కవులు , రచయితలకు రక్తదానం చేయాలంటూ ” బ్లడ్ డొనేషన్ ఛాలెంజ్ “విసిరారు . “రక్తదానం ప్రాణదానం తో సమానం” అటువంటి దానం లో మీరు భాగస్వాములు కండి” అంటూ కిషన్ పటేల్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసారు.