365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్17,2020: యుకెకు చెందిన సుప్రసిద్ధ డిజిటల్ వ్యాపార ఆర్ధిక వేదిక , టైడ్ నేడు లాంఛనంగా తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్ధ సాంకేతికావసరాలకు అవసరమైన మద్దతును ఈ కేంద్రం అందించనుంది. వ్యాపార ఆర్థిక సేవలలో ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్ ఛాలెంజర్‌గా నిలువడాన్ని సంస్ధ లక్ష్యంగా చేసుకుంది. దాదాపు 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఇప్పటికే 70కు పైగా అనుభవజ్ఞులైన, అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు విప్లవాత్మక సాంకేతికతలపై పనిచేస్తున్నారు.

ఈ నూతన కేంద్ర ఆరంభం, హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకోవడంపై గై డంకన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, టైడ్ మాట్లాడుతూ ‘‘అసాధారణ వృద్ధిని టైడ్ నమోదు చేస్తుండటంతో, మేము మా పరిధికి ఆవల చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మా టెక్నాలజీ, మద్దతు కేంద్రం ఉన్నటువంటి యుకె, బల్గేరియాలో మా అవసరాలకు తగినట్లుగా ఉద్యోగులను వేగవంతంగా నియమించుకోవడం కష్టసాధ్యంగా మారింది. మా సీనియర్ నాయకత్వ బృందానికి భారతదేశంలో కార్యాలయాలను ఏర్పాటుచేయడంతో పాటుగా సాంకేతికత కేంద్రాలను ఏర్పాటుచేసిన అపారమైన అనుభవం ఉంది.
అత్యున్నత నాణ్యత కలిగిన సాంకేతిక ప్రతిభ, నైపుణ్యాల పరంగా విస్తృత శ్రేణి అనుభవం కలిగిన ప్రతిభావంతులను మేము కోరుకోవడం చేత , అది మమ్మల్ని హైదరాబాద్‌ను ఎంచుకునేలా చేసింది. ఈ కేంద్రాన్ని మరింతగా విస్తరించడంతో పాటుగా టైడ్ యొక్క అంతర్జాతీయ వ్యూహంలో దీని బాధ్యతను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను చూస్తున్నాం’’ అని అన్నారు.