Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger reportHyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, జనవరి 11,2021 ః రెండు త్రైమాసాలు స్థబ్తుగా ఉన్న గృహ మార్కెట్లు,దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లలో పునరుద్ధరించబడినట్లుగా కనిపిస్తుంది. నూతన ప్రారంభాలతో పాటుగా అమ్మకాల పరంగా కూడా వృద్ధి అక్టోబర్‌ డిసెంబర్‌ 2020 నడుమ కాలంలో కనిపించింది.‘‘దక్షిణ భారతదేశపు మార్కెట్‌లలో బెంగళూరు, చెన్నై,హైదరాబాద్‌లలో పునరుద్ధరణ అనేది కనిపిస్తుంది. దేశంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలలో 43% ఇక్కడే గత త్రైమాసంలో కనిపించడంతో పాటుగా మొత్తంమ్మీద అమ్మకాల పరంగా 29% వాటాను ఇదే కాలంలో ఈ నగరాలు ఆక్రమించాయి. ఈ మూడు నగరాలలోనూ అందుబాటులోని గృహాల విభాగం అగ్రస్ధానంలో కొనసాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించవలసినది మాత్రం హైదరాబాద్‌ నగరాన్ని ! ఎందుకంటే మిగిలిన చాలా నగరాలలో తిరోగమన ధోరణి కొనసాగుతుంటే, ఈ నగరంలో మాత్రం ధరల వృద్ధి కనిపించింది. వాణిజ్య పరంగా ఈ నగరం సాధించిన వృద్ధితో పాటుగా హైదరాబాద్‌ ,రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ తమ నూతన , ప్రపంచశ్రేణి మౌలిక వసతుల ప్రాజెక్టుల కారణంగా ప్రయోజనం పొందింది. దీనికి తోడు నివాసితులకు ఈ ప్రాజెక్టులు అందిస్తున్న జీవిత నాణ్యత కూడా కారణమే’’ అని మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్,ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

మొత్తంమ్మీద ఆవిష్కరణలలో 43% మూడు దక్షిణాది నగరాలలోనే జరిగాయి

Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report
Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report

ఈ త్రైమాసంలో అత్యధిక సంఖ్యలో యూనిట్లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. జాతీయ ధోరణులకు ప్రతిబింబంగా నిలిచే ఈ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం విలువ పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో అత్యధిక అమ్మకాలు భారతదేశపు ఇన్‌ఫర్మేషన్‌ రాజధాని బెంగళూరులో కనిపించాయి.సంయుక్తంగా ఈ మూడు నగరాలలోనూ డిసెంబర్‌ త్రైమాసంలో మొత్తంమ్మీద 43%నూతన ఆరంభాలు జరిగాయి. అదే సమయంలో జాతీయ అమ్మకాలలో 29% వాటాను ఈ మూడు నగరాలూ ఆక్రమించాయి.

2020 నాల్గవ త్రైమాసంలో నూతన ఆరంభాలు

బెంగళూరు                  6,104

చెన్నై                         4,887

హైదరాబాద్‌                  12,723

2020 నాల్గవ త్రైమాసంలో గృహ విక్రయాలు

బెంగళూరు                  7660

చెన్నై                         3180

హైదరాబాద్‌                  6,487

అమ్మకాలతో పాటుగా నూతన సరఫరా పరంగా, ఈ మూడు నగరాలలోనూ వృద్ధి అనేది జులై–సెప్టెంబర్‌ 2020 కాలంతో పోల్చినప్పుడు కనిపించింది.

బెంగళూరులో, అందుబాటు ధరలలోని గృహ విభాగం (45 లక్షల రూపాయల లోపు యూనిట్లు) 27% ప్రారంభాలు ,25% అమ్మకాలకు తోడ్పాటునందించాయి. చెన్నైలో ఈ విభాగం  38% ప్రారంభాలు,37% విక్రమాలకు తోడ్పాటునందిస్తే, హైదరాబాద్‌లో అది 33% ప్రారంభాలు ,17% విక్రయాలకు తోడ్పాటునందించింది.ఆఫీస్‌ కార్యకలాపాల పరంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, డిమాండ్‌ పరంగా అత్యధిక వాటా కనిపించింది. చెన్నైలో మరోవైపు, చెన్నై పశ్చిమ ప్రాంతాలైన మొగాప్పియర్‌ , పెరుంబాకమ్, ఓఆర్‌ఆర్‌పై వృద్ధి చెందుతున్న షోలింగానల్లూర్‌లలో  అమ్మకాల పరంగా వృద్ధి చెందుతుంది. బెంగళూరులో, ఈ డిమాండ్‌ వర్తూర్‌, వైట్‌ఫీల్డ్‌, బెగూర్‌, బుడిగిరి , కృష్ణ రాజపుర లలో నూతన సరఫరాను బెంగళూరు ఉత్తర భాగాలైన బుడిగిరి క్రాస్‌,  కోగిలు, యెలంక వద్ద కూడా కనిపించింది.

Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report
Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report

దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్‌లో అతి తక్కువ ఇన్వెంటరీ కనిపించింది…

డిసెంబర్‌ 21,2020 నాటికి చెన్నైలో అతి తక్కువ అన్‌సోల్డ్‌ స్టాక్‌ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్‌లోనే అతి తక్కువ ఇన్వెంటరీ 29 నెలల కాలం వద్ద కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ ఈ త్రైమాసంలో గణనీయంగా 19% వృద్ధి చెందింది.  దీనికి నూతన సరఫరా ఒక్కసారిగా పెరగడమూ కారణమే. చెన్నైలో సైతం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌  అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ 5% వృద్ధి చెందింది. బెంగళూరులో ఇది 11% తగ్గింది.ఇన్వెంటరీ ఓవర్‌ హ్యాంగ్‌ అనేది ప్రస్తుత స్టాక్‌ విక్రయానికి, ఈ సంవత్సర అమ్మకపు వేగం ఆధారంగా అమ్మకాలకు  పట్టే కాలంగా డెవలపర్లు అంచనా వేసే కాలం.

అమ్ముడు కాకుండా ఉన్న స్టాక్‌ నగర వ్యాప్త బ్రేకప్‌

నగరం                        డిసెంబర్‌ 31,2020 నాటికి స్టాక్‌                ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌

బెంగళూరు                             71,198                     36

చెన్నై                                   36,609                     42

హైదరాబాద్‌                            39,308                     29

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 2019 నుంచి ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది వృద్ధి చెందుతూనే ఉంది. డిసెంబర్‌ 2019 చివరి నాటికి బెంగళూరులో ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది 25 నెలలుగా ఉంటే, చెన్నైలో 26నెలలు, హైదరాబాద్‌లో 13 నెలలుగా ఉంది.డిమాండ్‌ తగ్గినప్పటికీ హైదరాబాద్‌లో ధరలు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయిదేశవ్యాప్తంగా డిమాండ్‌ నెమ్మదించడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, నిజామ్‌ల నగరంలో మాత్రం ధరల పరంగా వృద్ధి కనిపిస్తోంది. నాల్గవ త్రైమాసంలో సైతం ఈ ఫార్మాస్యూటికల్‌ కేంద్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ధరలు 5% వృద్ధి చెందాయి. సరాసరి ధరలు స్థిరంగా వృద్ధి చెందడం వల్ల ఆస్తుల ధరలు హైదరాబాద్‌లో ప్రస్తుతం అధికంగానే ఉన్నాయి. బెంగళూరు, చెన్నైలలో  సరాసరి విలువ 2% వృద్ధి చెందింది.

Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report
Hyderabad continues price rally in Q4; Bengaluru, Chennai show signs of overall revival: PropTiger report

దక్షిణాది నగరాలలో రమారమి ధరలు

నగరం          డిసెంబర్‌ 31,2020నాటికి రమారమి ధరలు             వార్షిక మార్పు

హైదరాబాద్‌                5602 రూపాయలు                                                  5%

బెంగళూరు                  5,342 రూపాయలు                                                 2%

చెన్నై                         5,228 రూపాయలు                                                 2%