365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ సెప్టెంబరు 24, 2020: టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసులలో నేషనల్ లీడర్ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) ఏస్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు ప్రకటించింది.ఆకాష్ కంపెనీ ,ఆకాష్ ఇనిస్టిట్యూట్, ఆకాష్ ఐఐటి-జెఇఇ, ఆకాష్ డిజిటల్, మెరిట్ నేషన్ తో సహా దీని వివిధ బ్రాండులను ప్రమోట్ చేయుటలో సహకరించుటకు ఈ క్రికెటర్ బోర్టులో చేరారు, ఆకాష్ ఫేస్ రూపంలో యువరాజ్ సింగ్ ఆకాష్ డిజిటల్ కొరకు, బ్రాండ్ ఆమ్ని- ఛానల్ ‘విజయం నిరీక్షిస్తుంది ‘ ఉద్యమాన్ని కొనసాగిస్తారు.‘విజయం నిరీక్షిస్తుంది‘ అనే ఉద్యమం మెడికల్,ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష కోసం తిరిగి హాజరయ్యే విద్యార్థుల కోసం ఉద్దేశించబడినది. అలాంటి విద్యార్థులకు ప్రేరణ అందించి, మరో ప్రయత్నానికి వారిని తయారు చేయటం దీని ఉద్దేశం,ఇది డిజిటల్ మాధ్యమంలో ఉంటుంది.ఒక క్రీడాకారుని ద్వారా ‘తిరిగి దృఢంగా మళ్లీ రండి‘ అనే ప్రధాన సందేశంతో, తిరిగి పరీక్షకు తయారయ్యే ప్రేరణ కలిగించే ఒక కథ ఈ కంపెనీకి కావాలి, ఈ సందేశాన్ని ప్రభావవంతంగా ఇంటింటికి చేరవేయ గలిగిన పరిపూర్ణ వ్యక్తి యువరాజ్. దేశంలో క్రికెట్ చాలా విస్తృత ప్రచారం కలిగిన క్రీడ కాబట్టి, యువరాజ్ సింగ్ తిరిగి రావటం అనే కథ చుట్టూ ఈ సందేశం రూపొందించబడినది. ఈయన చాలా మంది భారతీయులకు ఒక ప్రేరణాత్మకమైన వ్యక్తి, ముందుగా ఒక విజయవంతమైన క్రికెట్ క్రీడాకారునిగా, ఆ తర్వాత క్యాన్సర్ తో అతను పోరాడుట,అతని ప్రేరణాత్మకమైన పునరాగమనం ,ఇప్పుడు అతని మానవీయ సేవా కార్యక్రమాలు ప్రధానమైనవి.యువరాజ్ సింగ్ తో తమ సహకార సంబంధాలపై మాట్లాడుతూ, శ్రీ ఆకాష్ చౌధరి, డైరెక్టర్ , సిఇఒ, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) ఇలా అన్నారు, “యువరాజ్ సింగ్ ను ఆకాష్ పరివారంలో ఒక భాగంగా చేర్చుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్లిష్టమైన పరీక్షలలో ప్రతి విద్యార్థి తమ ఉత్తమమైన పనితనం చూపించుట జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి విజయ ఫలాలు ఆశించిన ప్రతి సారి లభించవు అనే నిజాన్ని కూడా మేము అంగీకరిస్తున్నాం. విద్యార్ధుల పోరాటంలో మేము ఎల్లప్పుడు వారి వెంట ఉన్నాము అనీ, అలాగే వారి బలహీనతలు గుర్తించి, వారికి సహకరిస్తూ, వారి సామర్థ్యం పెంచేలా పనిచేయుటకు మేము సిధ్దంగా ఉన్నాం. నేటి యువ సముదాయంలో యువరాజ్ ప్రాచుర్యం, అతని అగ్రగామి విజయ గాథ, ప్రేరణాత్మకమైన పునరాగమనం – ఇవన్నీ దాటిన తర్వాత, ఆయన ఈ ఉద్యమం ద్వారా, మరింత దృఢనిశ్చయం, సామర్థ్యం, కేంద్రీకరణతో విద్యార్థులు వెనక్కి బౌన్స్ బ్యాక్ అయి, వైఫల్యాన్ని విజయంగా మార్చుకునే మార్గంలో కృషి చేసేలా వారికి ప్రేరణ అందించ గలరని మేము విశ్వసిస్తున్నాము. ”ఈ ఫిల్మ్ లో యువరాజ్ సింగ్ తో కలిసి వెళ్లే సుదీర్ఘమైన నడకలో, ఒక వ్యక్తి యొక్క జీవన ప్రయాణంలోని ఎత్తు పల్లాలను చూపించుట జరుగుతుంది. సంబంధిత సందర్భాలలో, అప్ రూట్ అయిన గతంలోని క్రికెట్ స్టంప్స్, గతంలో గెలిచిన ట్రాఫీలు, అతని ఆటోగ్రాఫ్ కోసం కేకలు వేసే అభిమానులు, అతడు టీమ్ లో భాగంగా లేరని చూపించే వార్తా పత్రికల హెడ్ లైన్స్ మొదలైనవి షాట్స్ లో అక్కడక్కడ చూపించ బడినవి, స్కూలు పిల్లలు చదువుట, దృఢ సంకల్పంతో అద్దంలో చూసుకొనుట, ఒక్కొక్క సారి అధైర్యంగా కనిపించుట మొదలైనవి కనిపిస్తాయి. ఈ ఫిల్మ్ విద్యార్థులను తిరిగి పుంజుకున్న సామర్థ్యంతో విజయ మార్గం పై తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రేరేపిస్తుంది.
ఆకాష్ ఇనిస్టిట్యూట్ ,అసోసియేట్స్ గురించి మాట్లాడుతూ, ఏస్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలా అన్నారు, “ ఆకాష్ తమ విద్యార్థులను ఎప్పుడూ వదిలేయవద్దని, ఆ కఠినమైన ఎంట్రన్స్ పరీక్షలో విజయం సాధించేందుకు సహాయపడుతూ చక్కని శిక్షణ ఇస్తుంది, కాబట్టి వీరితో నేను చేరటం జరిగింది. ఈ ఫిల్మ్ థీమ్ కూడా ఒక విధంగా నా జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. నేను జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూసాను. ఈ ఫిల్మ్ ద్వారా నేను విద్యార్థులకు చెప్పదలచింది ఏమిటంటే, ప్రపంచం నిన్ను పరాజయం అని పిలిచినప్పుడు, మీరు మిమ్మల్ని ఒక విజయంగా పిలవవచ్చు. మీ మీద గొప్ప విశ్వాసం, అంటే తమలో కంటె ఎక్కువగా మీ మీద అంత నమ్మకం కలిగిన ఒక కోచ్ ను మీరు వెదకండి. ఇది జరిగినప్పుడు, మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు అని నేను నమ్మకంగా చెబుతున్నాను.”ఈ పరిస్థితి కారణంగా తిరిగి పరీక్షలు రాసేవారికి ఉండే తక్కువ ప్రిపరేషన్ తో, విద్యార్థులో డిజిటల్ పార్మట్ అత్యంత మెరుగైన మాధ్యమం. ఆకాష్ ఇనిస్టిట్యూట్ ,టెస్ట్ ప్రిపరేషన్ శిక్షణతో పాటు శ్రేష్ఠమైన డిజిటల్ సామర్థ్యం కారణంగా, జనసాధారణ పరిధిలో ఆకాశ్ డిజిటల్ అత్యంత దృఢమైనదిగా పేరు పొందింది.అకడమిక్ విజయం సాధించాలని కోరుకునే విద్యార్థుల అన్వేషణలో ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు సహాయం అందజేస్తుంది. దీనికి పాఠ్యభాగం,కంటెంట్ డెవలప్మెంట్ , ఫ్యాకల్టీ ట్రైనింగ్ ,మానిటరింగ్ కొరకు దీని నేషనల్ అకడమిక్ టీమ్ ద్వారా నిర్వహించబడే ఒక సెంట్రలైజ్డ్ ఇన్ హౌస్ ప్రాసెస్ విధానం ఉంది. అనేక సంవత్సరాలుగా, ఎఇఎస్ఎల్ విద్యార్థులు అనేక మెడికల్ , ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు,ఎన్.టి.ఎస్.ఇ, కె.వ.పి.వై, ,ఒలింపియాడ్స్ వంటి కాంపిటీటివ్ పరీక్షలలో నిరూపిత ఎంపిక ట్రాక్ రికార్డు చూపించారు.