365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మర్చి 9,2025 : “మహిళ మనసే ఒక కాన్వాస్” అనే భావనను ప్రతిబింబిస్తూ, మహిళా సాధికారతకు అద్భుత వేదికగా నిలిచింది మహిళా కళా ప్రదర్శన. ఈ ప్రదర్శన ను మాసబ్ ట్యాంక్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ & ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో (JNAFAU) ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 8 నుంచి 88 ఏళ్ల వయస్సు గల 108 మంది మహిళా కళాకారిణులు తమ ప్రతిభను రంగుల రూపంలో ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి…ఆపిల్ తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించవచ్చా..?
ఇది కూడా చదవండి…ఆరోగ్యశ్రీ ద్వారా నిమ్స్‌లో యువకుడికి విజయవంతమైన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇది కూడా చదవండి…మహిళా దినోత్సవం సందర్భంగా మెగా మదర్ అంజనమ్మతో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సంతోషకరమైన అనుభూతులు!
ఈ ప్రత్యేక కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డీస్ట్రిక్ 320ఎ వైస్ గవర్నర్ డా. మహేంద్రకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, “సృజనాత్మకతకు వయస్సు అడ్డంకి కాదు. ఈ కళా ప్రదర్శన ద్వారా మహిళల భావోద్వేగ శక్తి మరింత ప్రబలంగా వెల్లడవుతోంది” అని తెలిపారు.
ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ.. 8 నుంచి 88 ఏళ్ల వయస్సు గల మహిళలు తమ కలల్ని, భావోద్వేగాలను రంగుల రూపంలో ప్రపంచానికి తెలియజేస్తున్నారన్నారు. “మహిళ మనసు ఒక సున్నితమైన క్యాన్వాస్ అన్నారు.ప్రతి భావోద్వేగం ఒక ప్రత్యేకమైన రంగని చెప్పారు. ఆమె జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఆమె చిత్రాలను అద్భుత కళాఖండాలుగా మార్చుతాయి” అని తెలిపారు.

మహిళల మనోభావాలను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనకు హాజరై, రంగుల మాధ్యమంగా వ్యక్తమయ్యే భావాలను అనుభవించాలని నిర్వాహకులు కోరుతున్నారు. 20మంది మహిళా కళాకారిణులకు డా.మహేంద్ర కుమార్, డా.హిప్నో పద్మా కమలాకర్, ఎన్. సి.సి సరోజా, డాన్సర్ చుడామణి, చొక్కాపు వెంకట రమణ, అకాడమీ డైరెక్టర్ సిరి, స్వామి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసారు.