365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 21,2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షణ గురువులు మధుహాస్, మూలాచంద్ శర్మ గారు యోగాసనాలు, ప్రాణాయామం శిక్షణ,అవగాహనను కల్పించడం జరిగింది.
ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలని, ఉద్యోగులు పని వాతావరణం లో మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతతతో, జీవనశైలి వ్యాధులను అధిగమించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 300 కి పైగా వాలంటీర్లు, బోధన, బోధనేతర సిబ్బంది, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. రఘురామి రెడ్డి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ జె. సత్యనారాయణ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి, వ్యాయామ విద్య విభాగాధిపతి డాక్టర్ సురేష్, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. సుమాలిని, డాక్టర్ ఎ.మీనా, డాక్టర్ కె.అరుణ, డాక్టర్ పి. ప్రశాంత్, డాక్టర్ రంజిత్, కె. చైతన్య పాల్గొన్నారు.