Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ఫిబ్రవరి 21,2020:శివరాత్రి పండుగ సందర్భంగా దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి హెలికాప్టర్ సర్వీస్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమానేని రమేష్,టూరిజం శాఖ చైర్మన్ భూపతి రెడ్డి,ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డిలు పాల్గొన్నారు.

తెలంగాణ లో వేములవాడ కు ఎంతో చరిత్ర ఉంది,ఇప్పటికే మంత్రి కేటీఆర్ రివ్యూ చేశారు,నిధులు కూడా మంజూరు చేశారు
వేములవాడ కు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు
శివరాత్రి పండుగకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఇవ్వాళ స్టార్ట్ అవుతాయి
శివరాత్రి రోజు లక్ష మంది జాగారం చేస్తారు వారికోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శివార్చన కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. శివరాత్రి పండుగ సందర్భంగా ఈసారి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక హెలికాప్టర్ సదుపాయాలు కలిపిస్తున్నాం .హెలికాప్టర్ ద్వారా వేములవాడ దర్శనం తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మిడ్ మానేరు చూసేందుకు కూడా ఏర్పాటు చేశాం: టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మొన్ననే మేడారం జాతరను విజయవంతంగా జరుపుకున్నాం
మేడారం కు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ బాగా నడిపించాం
దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ కు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ ను నడిపిస్తున్నాం
టూరిజం కు సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు
వేములవాడ కు ఎన్నడూ కూడా హెలికాప్టర్ సర్వీస్ లు ఏర్పాటు చేయలేదు
జాగారం రోజు వేములవాడ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నఅన్ని దేవాలయాలకు హెలికాప్టర్ సర్వీస్ లు ఏర్పాటు చేస్తాం .టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది,కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుంది. వేములవాడ కు ప్రత్యేక టూరిజం బస్ లు ఏర్పాటు చేశాం.హెలికాప్టర్ లో వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది.వేములవాడ లో రైడ్ చేయడానికి 3000 ఉంటుంది. వేములవాడ మిడ్ మానేరు కు 5500
హైదరాబాద్ నుండి వేములవాడ కు 30000 ప్లస్ జిఎస్టీ బుకింగ్ కోసం 09400399999,09880505905,095444444693 మేడారం కు హెలికాప్టర్ సర్వీస్ విజయవంతంగా నడిపించాం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి వేములవాడ వరకు హెలికాప్టర్ సర్వీస్ లు నడిపిస్తున్నాం.హైదరాబాద్ నుండి వేములవాడ కు ఒక్కరికి 30000 రూపాయలు
అక్కడ వేములవాడ లో జయ్ రైడ్ కు 3000
వేములవాడ, మిడ్ మానేరు రైడ్ కు 5500
సీఎం కేసీఆర్ అన్ని దేవాలయాలకు హెలికాప్టర్ సర్వీస్ లు నడిపించాలని చెప్పారు త్వరలోనే ఈ సర్వీస్ లు స్టార్ట్ చేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు కూడా హెలికాప్టర్ సర్వీస్ లు స్టార్ట్ చేస్తాం.శాశ్వతంగా తెలంగాణ లోని అన్ని దేవాలయకు హెలికాప్టర్ సర్వీసు స్టార్ట్ చెయ్యాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు
భక్తులు అందరూ ఈ సర్వీస్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. 3 రోజుల పాటు ఈ సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి.

error: Content is protected !!