365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ,ఆగష్టు 4,2021: భరించదగిన రవాణా దిశగా స్థిరమైన ప్రత్యామ్నాయం (సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ -ఎస్ఎటిఎటి) అన్న చొరవ కింద 13 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ప్లాంట్ల నుంచి సిబిజి సరఫరాను ప్రారంభించినట్టు 22.07.21న రాజ్యాసభలో అడిగిన ఒక ప్రశ్నకు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఎస్ఎటిఎటిలో పాలుపంచుకుంటున్న చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు పారిశ్రామికవేత్తల నుంచి 1957 టన్నుల సిబిజిని సేకరించారు.ఎస్ఎటిఎటి కింద సిబిజి ఉత్పత్తి, సరఫరా కోసం సంభావ్య పారిశ్రామికవేత్తల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (అధికారికంగా ఆసక్తి వ్యక్తీకరణ) కోసం చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానిస్తూనే ఉన్నాయి.