365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై, అక్టోబర్18,2022: చదువు కోవడానికి వయసుతో సంబంధం లేదు.అదే విషయాన్ని58ఏళ్ల తర్వాత నిరూపించాడు ఓ వ్యక్తి. చెన్నైకి చెందిన పార్థివన్. వయసు 58 సంవత్సరాలు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు అందరిలాగే డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తర్వాత చిన్న ఉద్యోగం చేశాడు. ఎందుకో కొన్నాళ్ళకు మళ్లీ చదువు మీద ధ్యాస పుట్టింది.
అంతే…మరో డిగ్రీ కోర్సులో జాయినయ్యాడు. ఆ డిగ్రీ కూడా పూర్తయింది. మరో డిగ్రీ కోర్సు మొదలుపెట్టాడు. ఇలా ఒకటి అయిపోగానే డిగ్రీలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన డిగ్రీల సంఖ్య 145కు చేరింది. రిజిస్టేషన్లాంటి హడావిడిలేని విద్యాసంస్థలను వెతికి పట్టుకున్నాడు.
అందులో డిగ్రీలో సీటు సంపాదించాడు. న్యాయశాస్త్రంలో ఎనిమిది, ఆర్ట్స్ పది, సైన్స్లో మూడు, బిజినెస్ .అడ్మినిస్టేషన్లో ఎనిమిది డిగ్రీలు చేశాడు. ఇలా చెబుతూ పోతే ఆయన చేసిన డిగ్రీల జాబితా రాయడానికి ఒక పేజీ మొత్తం కావాలేమో. ఆయన పేరు పక్కన డిగ్రీలు రాయాలంటే చిన్నపాటి పుస్తకమే అవుతుంది. ఇలా 145 డిగ్రీలు చేసిన పార్టివన్ తన భార్యను కూడా ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతో ఆమె కూడా తొమ్మిది డిగ్రీ పట్టాలు అందుకున్నది.