Sun. Sep 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ సెప్టెంబర్ 27, 2023: ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో సమన్వయంతో బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ బెంగళూరులోని మాన్‌ఫో బెల్ హోటల్, మెజెస్టిక్‌లో అక్టోబర్ 1వతేదీన14వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2023 జరగనుంది.

ఇందులో పాల్గొనే అగ్రశ్రేణి ఇండియన్ మెమరీ అథ్లెట్లకు బీబీజీ బంగారు తల్లి మెమరీ అవార్డులను ప్రదానం చేస్తోంది.

భారతదేశ మెమరీ పవర్ ను మొత్తం ప్రపంచానికి ప్రదర్శించడమే ఈఅవార్డుల ప్రదానోత్సవం లక్ష్యం. విద్యార్థులు, పెద్దలు, విద్యావేత్తలు, వృత్తిపరమైన జీవితంలో రాణించడానికి సహాయం చేయడం దీని ఉద్దేశ్యం.

బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సిఎండి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ “బిబిజి బంగారు తల్లి మెమరీ అవార్డులలో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్ 2023 టైటిల్, వివిధ ట్రోఫీలు,పతకాలు వివిధ విభాగాలు, విజేతలకు సర్టిఫికెట్లు, ప్రైజ్ మనీ ఉంటాయి” అని చెప్పారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశంలోని పిల్లలు,పెద్దలు సీనియర్,జూనియర్ విభాగాలలో పాల్గొంటారు. పదాలు, యాదృచ్ఛిక సంఖ్యలు, బైనరీ సంఖ్యలు, చారిత్రక తేదీలు, వియుక్త చిత్రాలు, పేర్లు , ముఖాలు, ప్లే కార్డ్‌లు మొదలైన 10 విభాగాలలో ఛాంపియన్‌షిప్ జరుగుతుంది.

ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ గత 14 సంవత్సరాలుగా భారతదేశంలో మెమరీ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తోంది. పాల్గొనాలనుకునే వారు నమోదు, శిక్షణ కోసం స్క్వాడ్రన్ లీడర్ జయసింహ, ప్రెసిడెంట్ ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్‌ను సంప్రదించవచ్చు.

బీబీజీ నిబద్ధతతో కూడిన వివిధ విద్య, సురక్ష కార్యక్రమాల వంటి కార్యక్రమాల ద్వారా ఆడపిల్లల సాధికారతను కల్పించే పనిని చేపట్టింది. అందులోభాగంగానే బీబీజీ బంగారు తల్లి మెమరీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

error: Content is protected !!