365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, 2021 జూన్ 21: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 6 నుండి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 438 రోజులు పూర్తికాగా, జూన్ 21వ తేదీ నాటికి సుందరకాండ పారాయణం 376 రోజులు పూర్తి చేసుకుందని వివరించారు.


15వ విడత అఖండ పారాయణంలోని 174 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో పివిఎన్ఎన్.మారుతి, ఎం. పవనకుమార శర్మ పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.