Sat. Nov 9th, 2024
15TH EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM ON JUNE 21
15TH EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM ON JUNE 21
15TH EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM ON JUNE 21

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌, 2021 జూన్ 20: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూన్ 21వ తేదీ సోమవారం  15వ విడ‌త‌ సుందరకాండ  అఖండ పారాయణం జ‌రుగ‌నుంది.ఇందులో భాగంగా ఉద‌యం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు 6 సర్గల్లో గ‌ల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులు ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. కాగా, సుంద‌ర‌కాండ‌లో మొత్తం 68 స‌ర్గ‌ల్లో 2,821 శ్లోకాలు ఉన్నాయి. వీటిని 16 విడ‌త‌లుగా అఖండ పారాయ‌ణం చేయాల‌ని టిటిడి సంక‌ల్పించింది.

15TH EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM ON JUNE 21
15TH EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM ON JUNE 21

ఇప్పటివరకు టిటిడి 14 విడ‌త‌ల్లో అఖండ పారాయణాన్ని  విజయవంతంగా నిర్వహించింది.శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది

error: Content is protected !!