Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,నవంబర్‌ 8, 2021 ః రిపోర్ట్‌ కార్డ్‌  హెల్త్‌ ప్రోగ్రామ్‌ దేశవ్యాప్తంగా 64,165 మంది తల్లిదండ్రులను సంప్రదించడం తో పాటుగా వారి 3–18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు సవివరంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఓ సమగ్ర అధ్యయనాన్ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక మహారాష్ట్రలలో భారతదేశంలో  కోవిడ్‌కు ముందు 18 నెలల కాలంలో ఈ అధ్యయనం చేశారు.

హీల్ఫా హెల్త్‌ రిపోర్డ్‌ కార్డ్‌ వెల్లడించే దాని ప్రకారం, పరీక్షలలో పాల్గొన్న 17% మంది విద్యార్థులు రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం, పిల్లల్లో అత్యధిక రక్తపోటు అనేది  వృద్ధి చెందుతున్న ఆరోగ్య సమస్యగా మారుతుంది. చిన్నారులలో ఈ సమస్యను గుర్తించకపోవడం వల్ల పరిస్థితులు దిగజారే ప్రమాదాలూ ఉన్నాయి. చిన్నారులకు మూడు సంవత్సరాల వయసు దాటిన తరువాత సంవత్సరానికోమారు అయినా తప్పనిసరిగా రక్తపోటు పరీక్షలను  చేయించడం అవసరమని సూచించడమైనది. పెరుగుతున్న కాలుష్యం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయకపోవడం, పొగ బారిన పడుతుండటంతో  చిన్నారుల శ్వాస సంబంధిత వ్యవస్ధలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, ఈ పరీక్షలు నిర్వహించిన చిన్నారులలో  8% బాలికలు, 9% బాలురు పెరిగిన  రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన వాతావరణం సృష్టించడం ద్వారా మాత్రమే బీపీ సంబంధిత సమస్యలను అడ్డుకోగలము.

హీల్ఫా ఫౌండర్‌ అండ్‌ సీఎస్‌ఓరాజ్‌ జనపరెడ్డి ఈ నివేదికపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ‘‘భవిష్యత్‌ భారతంగా చెప్పబడుతున్న చిన్నారుల ఆరోగ్య స్ధితి పట్ల  తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌,ప్రభుత్వంకు రియాల్టీ చెక్‌గా హీల్ఫా హెల్త్‌ రిపోర్ట్‌ కార్డ్‌ నిలుస్తుంది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో 41% మంది ప్రజలు 18 సంవత్సరాల లోపు వారు. ఈ నివేదికలో వెల్లడించిన దాని ప్రకారం, మనం అత్యధికంగా పనిచేసే జనాభా దిశగా వెళ్తున్నాం కానీ , ఆరోగ్య పరంగా మాత్రం అనారోగ్యవంతమైన ప్రజలు దిశగా వెళ్తున్నాం. జీడీపీ ,ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై  ఈ సంభావ్య భారం  కనుగొనేందుకు సిద్ధంగా మనం లేము’’ అని అన్నారు.

‘‘మా పరీక్షలు చూపేదాని ప్రకారం, కేవలం 0.0018% మన చిన్నారులు నేడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఒకవేళ మనం ఈ డాటాను  మరింతగా విశదీకరిస్తే , ఓ దేశంగా 26.5 కోట్ల జనాభాలో కేవలం 4885 మంది మాత్రమే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉన్నారు ! ఇది ప్రమాదఘంటికలను మోగిస్తుంది. ప్రభుత్వంతో పాటుగా తల్లిదండ్రులు, ఈ దిశగా ఆలోచన చేయడంతో పాటుగా తగిన చర్యలను తీసుకోవాల్సి ఉంది. మహోన్నతమైన ఈ దేశ పౌరునిగా, ఓ తండ్రిగా, బాధ కలిగించే అంశమే ఇదని నాకు తెలుసు. ఆప్రమప్తతతో వైద్య, పారామెడికల్‌  పరిశ్రమ మన పిల్లలకు సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్యాన్ని అందించడంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఇది తక్షణావసరం’’ అని ఆయన అన్నారు.

బీపీ సమస్యలు పిల్లల్లో పెరగడం అనేది అత్యంత సవాల్‌తో కూడిన అంశమే అయినప్పటికీ, ఊహించని,బాధకరమైన అంశం ఏమిటంటే ఎక్కువ శాతం మంది పిల్లలు అధిక/స్వల్ప బీఎంఐ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటం.  పరీక్షించిన బాలురులో  దాదాపు 71% మంది బీఎంఐ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, 60% మంది బాలికలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనతో పాటుగా మన చిన్నారుల జీవనశైలి అలవాట్లు-అంటే ఆహారం ,వ్యాయామాలు,  స్ర్కీన్‌ టైమ్‌ను అత్యవసరంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది.

error: Content is protected !!