Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 1,2024: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌పై రష్యా విధించిన భారీ జరిమానా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ జరిమానా మొత్తం 20 డెసిలియన్ డాలర్లు (రెండు తర్వాత 34 సున్నాలు ఉండే సంఖ్య), ఇది ఇప్పటివరకు ఉన్న అన్ని ఆర్థిక ప్రమాణాలను మించి ఉన్నందున విశేషంగా భావించనుంది.

గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ యాజమాన్యంలో ఉన్న యూట్యూబ్‌పై రష్యా ఈ అసాధారణ జరిమానాను విధించింది. ఈ పెద్ద మొత్తాన్ని చాలా మంది ఇప్పటివరకు విన్న సందర్భమే లేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ 17 రష్యన్ స్టేట్-బ్యాక్డ్ ఛానెల్‌లను బ్లాక్ చేయడం వల్ల రష్యా కోర్టు గూగుల్‌పై ఈ చర్య తీసుకుంది. అలాగే, తొమ్మిది నెలల్లో యూట్యూబ్ ఈ ఛానెల్‌లను పునరుద్ధరించకపోతే, జరిమానా ప్రతిరోజూ రెట్టింపు అవుతుందని కోర్టు తీర్పు వెలువరించింది.

2024 అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. గూగుల్ ప్రస్తుత నికర విలువ సుమారు $2 ట్రిలియన్లు. అయినప్పటికీ, ఈ జరిమానా మొత్తం ప్రపంచ సంపదను కూడా మించి ఉంటుంది, అంటే ప్రపంచంలోని మొత్తం కరెన్సీ, ఆస్తులను కలిపినా ఈ మొత్తానికి సమానం కావడం లేదు.

రష్యా గతంలో కూడా గూగుల్‌కు జరిమానా విధించింది. జూలై 2022లో, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నిషేధిత కంటెంట్‌ను బ్లాక్ చేయడంలో విఫలమైనందుకు రష్యా Googleకి $21.1 బిలియన్ల జరిమానా విధించింది. ఆ తరువాత రష్యా మరింత పెద్ద మొత్తంతో జరిమానా విధించింది.

క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులను ప్రతీకాత్మక చర్యగా పేర్కొన్నారు. “గూగుల్ ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మా ఛానెల్‌ల నిషేధాన్ని తొలగించాలి” అని పెస్కోవ్ అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!